Mahabharat Web Series OTT Streaming On Jio Hotstar : మైథలాజికల్ ఎపిక్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జానర్‌లో వచ్చిన యానిమేటెడ్ మూవీస్, వెబ్ సిరీస్‌లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. రీసెంట్‌గా వచ్చిన 'మహావతార్: నరసింహ' దీనికి బెస్ట్ ఎక్సాంపుల్. ఇక ఇతిహాసాల్లో మహాభారతానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కురుక్షేత్ర మహా యుద్ధం దగ్గర నుంచీ గీతా బోధ వరకూ అన్నీ ఓ అద్భుతమే. అలాంటి మహాభారతాన్నే ఓ సిరీస్‌గా రూపొందించారు బాలీవుడ్ మేకర్స్.
AI టెక్నాలజీతో...
పాండవులు, కౌరవుల మధ్య జరిగే సన్నివేశాలతో పాటు మహాభారత యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు అన్నింటినీ కళ్లకు కట్టేలా అత్యాధునికి ఏఐ టెక్నాలజీతో అద్భుతంగా సిరీస్‌ను రూపొందించారు. బీఆర్ చోప్రా 'మహాభారతం' తర్వాత దాదాపు 35 ఏళ్లకు మైథలాజికల్ వెబ్ సిరీస్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఇదివరకూ లేని విధంగా సరికొత్తగా ఆవిష్కరించారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. 'విధి, ద్రోహం, యుద్ధం గొప్ప కథ. AI టెక్నాలజీ మహాభారత్: ఏక్ ధర్మ్‌యుద్ధ్ ప్రాణం పోసుకుంది.' అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read : రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ వచ్చేసింది - ట్రయాంగిల్ లవ్ రొమాంటిక్ డ్రామా ఎలా ఉందో తెలుసా?
100 ఎపిసోడ్స్
ఈ సిరీస్ మొత్తం 100 ఎపిసోడ్స్ ఉండనుండగా... ప్రతీ శనివారం ఓ కొత్త ఎపిసోడ్ ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాల రన్ టైంతో ఉంది. ఓటీటీలోనే కాకుండా అటు టీవీలోనూ ప్రీమియర్ కానుంది. స్టార్ ప్లస్ ఛానల్‌లో ఆదివారం రాత్రి 7:30 గంటలకు ఫస్ట్ ఎపిసోడ్ ప్రీమియర్ కానుంది. ప్రతీ వారం కొత్త ఎపిసోడ్ అందుబాటులో ఉంచనున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, మరాఠీ, బెంగాళీ మొత్తం 7 భాషల్లో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
'మహాభారత్' వెబ్ సిరీస్ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని జియో హాట్ స్టార్ CEO కెవిన్ వాజ్ అన్నారు. 'ఆడియన్స్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఏఐ టెక్నాలజీతో వెబ్ సిరీస్ రూపొందించాం. మహాభారత్ భారతదేశ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఈ సిరీస్ ద్వారా సంప్రదాయం, భవిష్యత్తు మధ్య వారధిని నిర్మిస్తున్నాం. మన పురాతన అత్యంత గౌరవనీయమైన కథలు ఇప్పటికీ మన భవిష్యత్తుగా ఉండగలవని నిరూపిస్తున్నాం.' అంటూ చెప్పారు.