Kalyani Priyadarshan's Kotha Lokah OTT Release On Jio Hotstar: ఎప్పుడెెప్పుడా అని ఎదురుచూస్తోన్న టైం వచ్చేసింది. మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ రీసెంట్ సూపర్ ఫాంటసీ బ్లాక్ బస్టర్ 'కొత్త లోక' ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' సొంతం చేసుకోగా ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'లోకా ప్రపంచం ఈ నెల 31 నుంచి ప్రత్యేకంగా ప్రసారం కానుంది' అంటూ సదరు ఓటీటీ సంస్థ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఓటీటీ రిలీజ్ డేట్‌పై పలుమార్లు రూమర్స్ రాగా నిర్మాత దుల్కర్ సల్మాన్ సైతం రియాక్ట్ అయ్యారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఓటీటీలో మూవీ కోసం ఎదురుచూడగా తాజాగా అఫీషియల్ డేట్ అనౌన్స్ చేశారు.
Also Read: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ చక్రవర్తి' - నల్గొండ కబడ్డీ ప్లేయర్ రియల్ లైఫ్ స్టోరీ
ఈ మూవీకి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా... కల్యాణి ప్రియదర్శన్‌తో పాటు 'ప్రేమలు' ఫేం నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే, దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, షాబిన్ షౌహిర్ అతిథి పాత్రల్లో నటించారు. దుల్కర్ తన సొంత నిర్మాణ సంస్థ 'వేఫేరర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై మూవీని నిర్మించారు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజ్ అయిన మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
స్టోరీ ఏంటంటే?
హీరోయిన్‌కు సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుంది? అనేదే ప్రధానాంశంగా మూవీని తెరకెక్కించారు. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కు సూపర్ పవర్స్ ఉన్న విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ పవర్స్‌తో ఆమె మంచి పనులు చేస్తుంటుంది. కొందరి ఆదేశాల మేరకు ఓ సాధారణ అమ్మాయిలా బెంగుళూరు వచ్చిన ఆమె రాత్రిపూట ఓ రెస్టారెంట్‌లో జాబ్ చేసుకుంటుంది. తనకు పవర్స్ ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంది.
ఇదే టైంలో చంద్ర అద్దెకు దిగిన ఇంటి ఎదురు అపార్ట్‌మెంట్‌లోనే సన్నీ (నస్లెన్) తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటాడు. తొలిచూపులోనే చంద్రను ఇష్టపడి ఆమె గురించి తెలుసుకోవాలని ఫాలో అవుతాడు. అయితే, ఆమె సాధారణ మనిషి కాదన్న విషయం తెలుసుకుని షాక్ అవుతాడు. అసలు చంద్ర ఎవరు? ఆమెకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? వందల ఏళ్లుగా ఆమె యవ్వనంగా ఎలా ఉంది? తన పవర్స్ మంచి కోసం వాడినా వచ్చినా ఇబ్బందులేంటి? ఓ పోలీస్ ఆఫీసర్ ఆమె వెంట ఎందుకు పడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మూవీ చూడాల్సిందే.