Janhvi Kapoor's Param Sundari OTT Streaming On Amazon Prime Video : బాలీవుడ్ స్టార్ సిద్దార్థ్ మల్హోత్రా, అందాల తార జాన్వీ కపూర్ జంటగా నటించిన రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'పరమ్ సుందరి'. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

Continues below advertisement


ఎందులో స్ట్రీమింగ్ అంటే?


ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ మూవీ ఇప్పటికే రెంటల్ విధానంలో అందుబాటులో ఉండగా... తాజాగా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ షేర్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీలో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీలతో పాటు సంజయ్ కుమార్, సిద్ధార్థ్ శంకర్ కీలక పాత్రలు పోషించారు. మడాక్ ఫిలిం బ్యానర్‌పై దినేష్ విజన్ మూవీని నిర్మించారు.






Also Read: ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ థ్రిల్లర్ 'భద్రకాళి' - 800 కోట్ల ల్యాండ్ స్కామ్ ఇప్పుడే చూసెయ్యండి


స్టోరీ ఏంటంటే?


ఢిల్లీకి చెందిన ధనవంతుల ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి పరమ్ (సిద్ధార్థ్ మల్హోత్రా). తండ్రి బిజినెస్‌లను కాదని తనను తాను నిరూపించుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో తండ్రి నుంచి డబ్బులు తీసుకుని వివిధ స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతాడు. ఇక ఫైనల్‌గా డేటింగ్ యాప్ 'ఫైండ్ మై సోల్ మేట్' స్టార్టప్‌లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటాడు. అయితే దీన్ని డెవలప్ చేసేందుకు రూ.5 కోట్లు తండ్రిని అడగ్గా ఆయన ఓ కండీషన్ పెడతాడు.


దీంతో కేరళ వెళ్లిన పరమ్ అక్కడ సుందరి (జాన్వీ కపూర్) ఇంట్లో హోమ్ స్టేకు దిగుతాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి... తాను అక్కడికి వచ్చిన విషయం, డేటింగ్ యాప్, తండ్రి పెట్టిన కండీషన్ గురించి చెబుతాడు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో సుందరి పెళ్లి బాధ్యతలను ఊరి పెద్దలు తీసుకుంటారు. ఇదే టైంలో వేణు నాయర్‌తో సుందరి పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు పరమ్ తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? పరమ్ సుందరిల పెళ్లి జరిగిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.