Rashmika Mandanna's The Girlfriend Trailer Out Now: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ యంగ్ హీరో దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్'. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ ఆకట్టుకుంటుండగా... తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ వేరే లెవల్‌లో ఉంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
'మనం ఓ చిన్న బ్రేక్ తీసుకుందామా? చిన్న అంటే చిన్న కాదు ఒక బ్రేక్ లాగా' అంటూ రష్మిక డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా... సెన్సిటివ్ ఆలోచనలు ఉన్న ఓ అమ్మాయికి, ఫాస్ట్‌గా ఉండే అబ్బాయికి మధ్య లవ్ ట్రాక్‌ను అందంగా చూపించారు. ప్రాణంగా ప్రేమించే అబ్బాయి వేరే అమ్మాయికి దగ్గరైతే ఆ యువతి ఏం చేసింది? అనేదే స్టోరీ అని తెలుస్తోంది. లవ్, ఎమోషన్, ఫీలింగ్స్, రొమాంటిక్ టచ్ అన్నీ కలిపి మూవీ ఉండనున్నట్లు అర్థమవుతోంది. కొన్ని కొన్ని సీన్స్‌లో రష్మికను ఎప్పుడూ చూడని విధంగా చూపించారు. బాయ్ ఫ్రెండ్, అతని లవర్ మధ్య నలిగిపోయే ఓ అమ్మాయి పడ్డ సంఘర్షణను చూపించారు. భూమా పాత్రలో రష్మిక కనిపించనుండగా... విక్రమ్ రోల్‌లో దీక్షిత్ అలరించనున్నారు. భూమా తండ్రిగా రావు రమేష్ కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం రష్మిక ఫీమేల్ ఓరియెంటెడ్ రోల్స్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ కూడా అలానే ఉంది. ఇదివరకు ఎన్నడూ చూడని రోల్‌లో ఆమె కనిపించబోతున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. సరికొత్త లవ్ స్టోరీని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ట్రయాంగిల్ లవ్ రొమాంటిక్ డ్రామా అని హైలైట్ అవుతోంది. 'అన్నీ ప్రేమకథలు అద్భుత కథలు కావు. కొన్ని వాస్తవాలను పరిశీలించి మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి.' అంటూ మూవీ టీం రాసుకొచ్చింది.
రిలీజ్ ఎప్పుడంటే?
మూవీలో రష్మిక, దీక్షిత్ శెట్టితో పాటు అను ఇమ్మాన్యుయెల్, రావు రమేష్, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ఫేమస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా... ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నవంబర్ 7న మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: 'పెద్ది' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది - రొమాంటిక్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?