Ram Charan's Peddi First Single Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. మూవీలో చరణ్ లుక్స్, గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉండగా సిగ్నేచర్ షాట్ గూస్ బంప్స్ తెప్పించింది. ఆ తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... దసరాకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందని ఆశించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌పై క్రేజీ బజ్ వైరల్ అవుతోంది.

Continues below advertisement

లవ్ రొమాంటిక్ సాంగ్

ప్రస్తుతం 'పెద్ది' మూవీ టీం శ్రీలంకలో సందడి చేస్తోంది. తాజాగా శ్రీలంకలో షూటింగ్ చేస్తుండగా... రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లపై లవ్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ వారం రోజులు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. 'మూవీ కోసం చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఇప్పటివరకూ సిల్వర్ స్క్రీన్‌పై చూడని గ్లోబల్ స్టార్‌ను చూస్తారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి.' అంటూ మూవీ టీం వెల్లడించింది.

Continues below advertisement

సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా... ఫస్ట్ సింగిల్ నవంబర్ 8న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరగనున్న ఏఆర్ రెహమాన్ స్పెషల్ ఈవెంట్‌లో ఈ పాటను స్పెషల్‌గా రిలీజ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన యాడ్‌లో పెద్ది స్టైల్ ఫాంట్‌తో పాటు 'మెగా కాన్సర్ట్' అంటూ మెన్షన్ చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: మహేష్ రాజమౌళి మూవీ అప్డేట్ - రూమర్, బజ్ కాదు... ఇట్స్ అఫీషియల్

బీజీఎం వేరే లెవల్

ఇప్పటికే గ్లింప్స్‌లో ఇచ్చిన బీజీఎం వేరే లెవల్‌లో ఉండగా... సాంగ్స్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అటు చరణ్, ఇటు బుచ్చిబాబుతో రెహమాన్‌కు ఇదే ఫస్ట్ మూవీ. ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మూవీలో చరణ్ సరసన అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా... కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, 'మీర్జాపూర్' ఫేం దివ్యేందు శర్మ, సీనియర్ నటుడు జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27 మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.