Rashmika Mandanna Remuneration: కన్నడ బ్యూటీ రష్మిక మందనా పేరు ప్రస్తుతం బాలీవుడ్‌లో తెగ వైరల్ అవుతోంది. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ వల్ల తనకు హిందీ ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ లభించింది. అందుకే తన తరువాతి సినిమాల రెమ్యునరేషన్స్ విషయంలో రష్మిక ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తెలుగు, హిందీ అని తేడా లేకుండా తన రెమ్యునరేషన్ ఫిక్స్ చేసిందని సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో అయితే రష్మిక ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా వెనకాడకుండా ఇచ్చే నిర్మాతలు ఉన్నా.. టాలీవుడ్‌లో మాత్రం ఈ విషయంలో నిర్మాతలు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.


‘యానిమల్’తో క్రేజ్..


టాలీవుడ్‌లో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ డిమాండ్లను అందుకోలేక నిర్మాతలు తెగ ఇబ్బందులు పడుతున్నారు. పైగా గత కొన్నేళ్లలో ఈ డిమాండ్లు మరింత పెరిగిపోయాయి. అలాగే ‘యానిమల్’లాంటి హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడంతో రష్మిక రెమ్యునరేషన్ రూ.4 కోట్లకు పెంచేసిందని సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన తరువాతి తెలుగు ప్రాజెక్ట్ కోసం రష్మిక రూ.4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని రష్మిక ఈ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకసారి తెలుగు సినిమాల విషయంలో తన రెమ్యునరేషన్ తగ్గించుకుంటూ బాగుంటుందని ఇండస్ట్రీ నిపుణులు సలహా ఇస్తున్నారు.


ఉన్నట్టుండి కోటి పెంచేసింది..


బాలీవుడ్‌లో ఫిల్మ్ మేకర్స్.. సినిమాకు ఎక్కువ బడ్జెట్ పెట్టాలన్నా.. నటీనటులకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలన్నా.. పెద్దగా వెనకాడరు. కానీ తెలుగులో ఫిల్మ్ మేకర్స్ పరిస్థితి అలా ఉండదు. తక్కువ, మీడియం బడ్జెట్‌తోనే కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించాలని టాలీవుడ్ మేకర్స్ ప్రయత్నిస్తుంటారు. అలాంటి సమయంలోనే రష్మిక లాంటి హీరోయిన్స్ అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే.. మేకర్స్‌పై బడ్జెట్ భారం ఎక్కువగా పడుతుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మొదటి ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. అదే ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ మూవీ కోసం రూ.3 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేయగా.. మేకర్స్ కూడా కాదనకుండా అందించారని సమాచారం. కానీ తన తరువాతి తెలుగు సినిమా నుండి మాత్రం అదనంగా మరో రూ.కోటి రెమ్యునరేషన్ పెంచాలనే ఆలోచనలో రష్మిక ఉన్నట్టు తెలుస్తోంది.


పూజా హెగ్డే బాటలో..


రష్మిక మందనా కంటే ముందు కొందరు హీరోయిన్లు కూడా ఇలాగే రెమ్యునరేషన్ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకొని చేతికి వచ్చిన ఆఫర్లను పోగొట్టుకున్నారని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఒకప్పుడు పూజా హెగ్డే కూడా భారీ రెమ్యునరేషన్‌తో, అంతులేని డిమాండ్స్‌తో మేకర్స్‌ను ఇబ్బంది పెట్టడంతో ప్రస్తుతం తన చేతిలో సినిమాలు ఏమీ లేవు. ఇక ‘యానిమల్’ తెచ్చిపెట్టిన క్రేజ్ చూసి రష్మిక కూడా అదే బాటలో వెళ్తే.. చివరికి తన పరిస్థితి కూడా అదే అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ‘పుష్ప 2’లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది. దాంతో పాటు ‘రెయిన్‌బో’, ‘గర్ల్‌ఫ్రెండ్’లాంటి మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ‘చావ’ అనే హిందీ మూవీలో కూడా రష్మిక నటిస్తోంది.


Also Read: ప్రేమలో పడొద్దు అంటాడు, ఆ విషయంలో మాకు బౌండ్రీస్ ఉంటాయి - చరణ్‌తో రిలేషన్‌పై ఉపాసన కామెంట్స్