Johnny Masters bail petition | హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ పిటిషన్ విషయంలో నిరాశే ఎదురైంది. జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చేందుకు పోక్సో కోర్టు నిరాకరించింది. రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టులో జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం చెప్పింది. ఈ క్రమంలో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ ను రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు కొట్టివేసింది. తోటి కొరియోగ్రాఫర్ పై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు.


జానీ మాస్టర్‌కు బ్యాడ్ టైం నడుస్తోందా?


ఎప్పుడైతే జానీ మాస్టర్ (Jani Master)పై లైంగిక వేధింపుల కేసు నమోదైందో అప్పటినుంచి ఆయనకు పరిస్థితులు అసలు కలిసి రావడం లేదు. అసలే జానీ మాస్టర్ పై కుటుంబసభ్యులు భరించలేని ఆరోపణలతో కేసులో ఇరుక్కున్నాడు. ఆపై ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చిందని, కాస్త ఊరట లభించిందని సంతోషించేలోపే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. మరికొన్ని గంటల్లో జైలు నుంచి బెయిల్ పై విడుదల అవుతారని కుటుంబం, ఆయన బంధువులు, అభిమానులు సంబరపడుతున్న సమయంలోనే జానీ మాస్టర్ కు బెస్ట్ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డు రద్దు చేసినట్లు అవార్డుల కమిటీ ప్రకటించింది. పోక్సో కేసులో అరెస్టైన వ్యక్తికి అవార్డు ఇవ్వడం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ సైతం కోర్టు రద్దు చేసింది. 


Also Read: Jani Master: ఆస్పత్రిలో జానీ మాస్టర్ తల్లి... కొడుకు జైలుకు వెళ్లాడన్న బెంగతో గుండెపోటు 


జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
జానీ మాస్టర్ విషయంలో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఓవైపు ఆయన భార్య జానీ మాస్టర్ కు నైతిక మద్దతు తెలుపుతున్నారు. తన భర్త ఏ తప్పు చేయలేదని, ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేసి కేసుల్లో ఇరికించారని జానీ మాస్టర్ భార్య ఆరోపించారు. అయితే కుమారుడు జైలుకు వెళ్లడంపై దిగులు చెందుతున్న జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ ఆస్పత్రిపాలయ్యారు. జానీ మాస్టర్ వచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు కావడంతో ఆమె వేదన రెట్టింపయింది. ఈ క్రమంలో ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో నెల్లూరు జిల్లాలో గల బొల్లినేని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. బీబీ జాన్ ను చూసేందుకు జానీ మాస్టర్ భార్య ఆయేషా వెళ్లి పరామర్శించారు. ఓవైపు భర్త జైలులో ఉండగా, మరోవైపు కుటంబ పెద్ద అత్తకు గుండెపోటు రావడం వారిని మరింతగా బాధిస్తోంది.


జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్
జానీ మాస్టర్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేయడంతో పాటు ఫిర్యాదు చేయగా కొరియోగ్రాఫర్ ను అరెస్ట్ చేశారు. అయితే జానీ మాస్టర్ పై వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందని ఓ యవకుడు ఆరోపించాడు. ఔట్ డోర్ షూటింగ్స్ కు వెళ్లిన సమయంలో తనను వేధించిందని జానీ మాస్టర్ కు అల్లుడు వరుసయ్యే యువకుడు చేసిన ఆరోపణలతో కేసులో ఊహించిన ట్విస్ట్ చోటుచేసుకుంది. 


Also Read: Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ