తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రముఖ నటి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ఓవియాకు సంబంధించిందిగా చెప్పుకుంటున్న వీడియో దుమారం రేపుతోంది.. క్షణంలో వైరల్ గా మారిన ఈ వీడియోపై ఆమె స్పందించిన తీరు మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓవియా గురించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి నెటిజెన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఆమె తెలుగులో నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? అందులో ఆమెతో కలిసి నటించిన హీరో ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. మరి ఆ సినిమా ఏంటి? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


ఓవియా నటించిన ఒకే ఒక్క తెలుగు సినిమా 
ఓవియా అసలు పేరు హెలెన్ నెల్సన్ ఓవియా. కేరళలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మలయాళం స్టార్ పృథ్వీరాజ్ తో కలిసి కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో స్థిరపడింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా ఆమెకు బిగ్ బాస్ షోనే మంచి పాపులారిటీని తెచ్చి పెట్టింది. మధ్యలోనే ఎలిమినేట్ అయినప్పటికీ ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది. అదే టైంలో ఓవియాకు తెలుగులో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. 2013లో 'ఇది నా లవ్ స్టోరీ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటీ. ఇందులో తరుణ్ లీడ్ రోల్ లో నటించాడు. కానీ ఇది 'నా లవ్ స్టోరీ' సినిమా తర్వాత తరుణ్ మరో సినిమా చేయకపోవడం గమనార్హం. హీరోకే కాదు ఓవియాకు కూడా తెలుగులో ఇదే చివరి సినిమా. ఈ సినిమాకు రమేష్ గోపి దర్శకత్వం వహించారు. కానీ మూవీ పెద్దగా ఆడలేదు. ఆశించిన రేంజ్ లో సినిమా ఆడకపోవడంతో ఓవియాకు తెలుగు మేకర్స్ నుంచి పిలుపురాలేదు. 



Read Also : Ratan TATA Movie: రతన్ టాటా చేసిన ఏకైక సినిమా... ఆయన మళ్లీ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? 




'ఇది నా లవ్ స్టోరీ' సినిమాకు ఆశించినంత రెస్పాన్స్ దక్కలేదు. తరుణ్ 'నువ్వే కావాలి' వంటి సినిమాలతో ఒకప్పుడు లవర్ బాయ్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ కొన్నాళ్ల తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన ఆయన 'ఇది నా లవ్ స్టోరీ'తో తెలుగు ప్రేక్షకుల ముందు ఇచ్చాడు. సినిమా స్టోరీ ఏంటంటే..  అభిరామ్ అనే ఒక యాడ్ ఫిలిం డైరెక్టర్ తన చెల్లి ప్రేమించిన వాడిని ఇచ్చి పెళ్లి చేసే పని మీద ఊరికి వెళ్తాడు. అక్కడ శృతికి బదులు అభినయ అనే అమ్మాయిని కలుసుకుంటాడు. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే అంతా బాగుంది అనుకునే లోపే పోలీసులు అభిరామ్ ను అరెస్ట్ చేస్తారు. అదికూడా అభినయ ఫిర్యాదుతో. ఈ ఊహించని సంఘటనతో అభినయ గురించి ఓ భయంకరమైన విషయం తెలుస్తుంది. అభినయకి సంబంధించిన వాస్తవం ఏంటి? అభిరాంపై అభినయ ఎందుకు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది? అభినయకు ఉన్న సమస్య ఏంటి? చివరికి వీరిద్దరూ ఒక్కటయ్యారా? అనే విషయాలు తెలియాలంటే 'ఇది నా లవ్ స్టోరీ' మూవీని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.