Ranbir Kapoor's Ramayana: ర‌ణ్ బీర్ కపూర్ ప్ర‌స్తుతం బిజీ బిజీగా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఈ మ‌ధ్యే 'యానిమ‌ల్'తో భారీ విజ‌యం సాధించిన ర‌ణ్ బీర్ ప్ర‌స్తుతం 'రామాయ‌ణ' ప్రాజెక్ట్ షూటింగ్‌లో ఉన్నారు. ముంబైలోని ఫిలిమ్ సిటీ, హెలిపాడ్‌లో షూటింగ్ ముమ్మ‌రంగా సాగుతోంది. అయితే, ఈ సినిమా త‌ర్వాత ర‌ణ్ బీర్ క‌పూర్ వెంట‌నే 'ల‌వ్ అండ్ వార్' షూట్ స్టార్ట్ చేస్తార‌ట‌. నిజానికి లీగ‌ల్ నోటీసుల వ‌ల్ల 'రామాయ‌ణ' లేట్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని అనుక‌ున్న‌ప్ప‌టికీ అనుకున్న టైం కంటే వేగంగా షూటింగ్ సాగుతుంద‌ని తెలుస్తోంది. 


ఆగ‌స్టులో ల‌వ్ అండ్ వార్.. 


ర‌ణ్ బీర్ క‌పూర్, సంజ‌య్ లీలా బ‌న్సాలీ కాంబినేష‌న్‌లో 'ల‌వ్ అండ్ వార్' సినిమా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈసినిమాలో ఆలియా భ‌ట్, విక్కీ కౌశ‌ల్ కూడా న‌టించ‌నున్నారు. కాగా.. ఈ సినిమా షూటింగ్ ఆగ‌స్టులో ప్రారంభం కాబోతుంద‌ట‌. ర‌ణ్ బీర్ 'రామాయణ' షూటింగ్ లో ఉన్న‌ప్ప‌టికీ.. ఈ సినిమా వ‌ర్క్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి స్క్రిప్ట్ రీడింగ్ సెష‌న్స్, డిస్క‌ష‌న్స్ చేసిన త‌ర్వాత న‌వంబ‌ర్ లో షూటింగ్ మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. రామాయ‌ణ ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ చివ‌రికి వచ్చిన త‌ర్వాత ఈ షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలియా భ‌ట్, విక్కీకి వేరే ప్రాజెక్టులు ఉన్న నేప‌థ్యంలో షూట్ మొద‌లుపెట్టి ముగించాల‌ని చూస్తున్నారు. ఇక దీనికి సంబంధించి షూటింగ్ ముంబైలో మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. దానికి సంబంధించి నిర్మించిన వెంట‌నే షూటింగ్ షురు చేస్తార‌నే వార్త కూడా గ‌ట్టిగా వినిపిస్తోంది.  


లీగ‌ల్ నోటీసులు.. అయినా షూటింగ్.. 


'రామాయ‌ణ' ఈ సినిమా కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమంది వేచిచూస్తున్నారు. అయితే, ఈ సినిమాకి సంబంధించి వివాదం న‌డుస్తోంది. ముందు ఈసినిమాని మంతెన మీడియా, అల్లు మీడియా ఇద్ద‌రు క‌లిసి నిర్మించేందుకు అగ్రిమెంట్ జ‌ర‌గ్గా కొన్ని కార‌ణాల వ‌ల్ల వాళ్లు త‌ప్పుకున్నారు. దీంతో ప్రైమ్ ఫోకస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. అయితే, అల్లు, మంతెన మీడియా వెంచర్స్ LLPతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తమకే దక్కుతాయని ఈ నోటీసులు పంపారు. ప్రైమ్ ఫోకస్ సంస్థ ‘రామాయణం’లోని ఏ కంటెంట్ ఉపయోగించినా కాపీ రైట్స్ వాయొలేషన్ కిందే పరిగణించాల్సి ఉంటుందని చెప్పింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంతెన, అల్లు మీడియా వెంచర్స్ ప్రకటించింది. దీంతో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఆగిపోతుంది అనే వార్త‌లు గ‌ట్టిగా వినిపించాయి. కానీ, 'రామాయ‌ణ' షూటింగ్ అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే జ‌రుగుతుంద‌ని నేష‌న‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. 


లీక్స్.. నో ఫోన్స్.. 


మ‌రోవైపు 'రామాయ‌ణ' సినిమాకి లీక్స్ భ‌యం ప‌ట్టుకుంది. ఇప్ప‌టికే సెట్ నుంచి చాలా ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. దీంతో ఆ టీమ్ జాగ్ర‌త్త ప‌డింది. షూట్ జ‌రుగుతున్న ప్ర‌దేశాల్లో ఫోన్ల‌ను అనుమ‌తించ‌కుండా, విజిలెన్స్ ఏర్పాటు చేశారు. సెట్స్ కూడా బ‌య‌టికి క‌నిపించ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు. 


Also Read: 10 వేల మందితో అదిరిపోయే యుద్ధ సన్నివేశాలు - హీరో సూర్య మూవీలో ఆ సీన్స్ అదిరిపోతాయట!