Can’t wait for you to meet our Bhairava’s Bhujji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆ స్పెషల్ పర్సల్ ఎవరో చెబుతూ తాజాగా మారో ఆసక్తిర పోస్ట్ చేశాడు. ఈ రోజు మన లైఫ్‌లో స్పెషల్ వ్యక్తిన పరిచయం చేయబోతున్నానని, అప్పటి వరకు వెయిట్ చేయలేకపోతున్నానంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ పోస్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఎవరా స్పెషల్ పర్సన్ అని ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.
అంతేకాదు ప్రభాస్ ఇవ్వబోయే ఆ సర్‌ప్రైజ్ కోసం ఈగర్ వేయిట్ చేస్తున్న క్రమంలో 'డార్లింగ్' నుంచి అప్‌డేట్ వచ్చేసింది. 'డార్లింగ్స్.. నా బుజ్జిని కలుసుకునే వరకు నేను వెయిట్ చేయలేకపోతున్నా' అంటూ అసలు విషయం చెప్పాడు. అసలు ప్రభాస్ చెప్పింది కల్కి 2898 ADల అప్‌డేట్ అని తేలిపోయింది. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో కాదు కల్కిలోని ప్రభాస్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు దీపికా పదుకొనె అని తెలుస్తోంది. మూవీ టీం కూడా మా భైరవ బుజ్జీని కలిసే వరకు ఆగలేకపోతున్నాడు అంటూ కల్కి టీం కూడా అప్డేట్ ఇచ్చింది.. రేపు మే 18న కల్కిలోని 'భైరవ' బుజ్జిని మూవీ టీం పరిచయం చేయబోతుంది.
అంటే రేపు కల్కి నుంచి హీరోయిన్ దీపికా పదుకొనె లుక్‌ను విడుదల చేయబోతున్నారు. దీనిపై మూవీ టీం కూడా అధికారిక ప్రకటన ఇచ్చింది. Can’t wait for you to meet our Bhairava’s #Bujji అంటూ కల్కి టీం ప్రకటన ఇచ్చింది. కాగా దీపికా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర భైరవకు 'బుజ్జి' పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రేపు శనివారం కల్కి నుంచి దీపికా లుక్ విడుదల చేస్తున్న క్రమంలో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎగ్జయిట్ అవుతున్నారు. కాగా నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్‌గా తెరకెక్కిస్తున్న 'కల్కి 2898 AD' జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నిర్మాత అశ్వినీ దత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుంది. సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న కల్కిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే విశ్వనటుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్ వంటి అగ్ర నటులు నటిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ కల్కి షూటింగ్ పూర్తి చేసుకున్న దీపికా పదుకొనె ఇటీవల డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్‌లో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నారు. ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ ఊహాజనిత ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారట. ఈ సినిమాలో మహాభారతం కాలం నుంచి క్రీ.శ. 2898 మధ్య జరిగే 6000 సంవత్సరాల చూపింయబోతున్నాడట. ఇందులో ప్రధాన పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టూ ఉంటాయని టాక్.