Devara Song Promo: దేవర ఫస్ట్ సాంగ్ ప్రోమో - 14 సెకన్స్ క్లిప్ చూస్తే పూనకాలే, ఫుల్ సాంగ్ వస్తే ఇంకెలా ఉంటుందో!

Jr NTR Devara First Single: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 19న విడుదల చేయనున్న 'దేవర' ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్' ప్రోమోను విడుదల చేశారు.

Continues below advertisement

Devara First Single Fear Song Promo: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు 'దేవర' సినిమా నుంచి గిఫ్ట్ వచ్చింది. ఫేవరెట్ హీరో పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్' విడుదల కానున్న సంగతి ప్రేక్షకులు అందరికీ తెలుసు. అయితే, ఆ సాంగ్ ఎలా ఉండబోతోందో చెప్పేందుకు చిన్న ప్రోమో విడుదల చేశారు. 14 సెకన్ల నిడివి ఉన్న ఆ ప్రోమో ఫుల్ సాంగ్ మీద అమాంతం అంచనాలు పెంచిందని చెప్పాలి.

Continues below advertisement

Also Read: ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఎక్కడ జరుగుతాయో తెలుసా? భార్య ప్రణతితో స్టార్ హీరో ఎక్కడికి వెళ్లారంటే?

సముద్రంలో వెళుతున్న పడవ... అందులో నల్ల రంగు లుంగీ కట్టుకుని నల్ల షర్టు వేసిన ఎన్టీఆర్! మధ్యలో సాంగ్ పాడుతున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్. అంతకు మించి విజువల్ పరంగా ఏమీ లేదు. కానీ, అనిరుద్ ఇచ్చిన బీట్, ఆ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవల్ అంతే! ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలే.

'దేవర' ఫస్ట్ సింగిల్ మీద అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ ''ఫియర్ సాంగ్ వచ్చిన తర్వాత 'హుకుం'ను మర్చిపోతారు'' అంటూ వేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అయ్యింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం 'జైలర్'లో అనిరుద్ కంపోజ్ చేసిన ఆ సాంగ్ భారీ హిట్. దాన్ని మించి ఉంటుందని చెప్పడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. తెలుగులో 'ఫియర్ సాంగ్'కు సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రి సైతం ''ఎర్ర సముద్రం ఎగిసెగిసి పడుద్ది'' అని పేరొన్నారు.

ఎన్టీఆర్ హీరోగా నటించిన 'బృందావనం' గుర్తు ఉందా? ఆ సినిమాకు కొరటాల శివ రచయిత. తారక్ ఫిల్మోగ్రఫీలో అదొక స్పెషల్ సినిమా. దర్శకుడిగా మారిన తర్వాత 'జనతా గ్యారేజ్'లో ఆయన్ను కొత్తగా చూపించారు. ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి 'దేవర' చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం, ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి.

'దేవర' సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్. ఎన్టీఆర్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పకులు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Read: ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ - NTR31 టైటిల్‌ ఇదేనట!

Continues below advertisement
Sponsored Links by Taboola