Nagababu Deactivated His Twitter Account After a Cryptic Post: ఓ వివాదస్పద ట్వీట్ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు ఎక్స్ అకౌంట్ మాయం అయ్యింది. నాగబాబు తన ఎక్స్ అకౌంట్‌ని డిలిట్ చేశాడు. ప్రస్తుతం దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎందుకు ఆయన తన ఎక్స్ అకౌంట్‌ని డిలిట్ చేశాడు, మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందా? అంతా ఇప్పుడు దీనిపై చర్చించుకుంటున్నారు. అయితే ఈసారి ఏపీ ఎన్నికల సెగ ఫిలిం ఇండస్ట్రీకి తాకిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య అభిప్రాయ బేధాలు తలత్తెలా చేసిందా? అని ఇండస్ట్రీ, రాజకీయ వర్గాలు చర్చికుంటున్నాయి. దీనికి కారణం అందరికి తెలిసిందే.
అదే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కి కాకుండా వైఎస్సార్ సీపీ పార్టీ అభ్యర్థి తరపు ప్రచారం చేయడమే. దానికి ముందే తన మద్దతు పవన్ కళ్యాణ్‌కే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజే నంద్యాల వెళ్లి వైఎససార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశాడు. ఇందులో బన్నీ ఉద్దేశం ఏదైనా మెగా ఫ్యాన్స్, ఫ్యామిలీ మాత్రం హర్ట్ అయ్యారన్నది నిజం. పోలింగ్ తర్వాత నాగబాబు కొణిదెల తన ఎక్స్‌లో చేసిన పోస్ట్ చూస్తే అదే అనిపించించింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే' అంటూ ట్వీట్ వదిలాడు.
నాగబాబుకు ఫ్యాన్స్ కౌంటర్
ఈ ట్వీట్ బన్నీని ఉద్దేశించినట్టు ఉండటంతో ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు. పోలింగ్ రోజు బన్నీ దీనిపై క్లారిటీ కూడా ఇచ్చాడు. తాను ఏ పార్టీకి సపోర్టు కాదని, అన్ని పార్టీలకు న్యూట్రల్ అనన్నాడు. తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసమే నంద్యాల వెళ్లానని స్పష్టం చేశాడు. అయినా కూడా నాగబాబు ఈ ట్వీట్ చేయడం వేనక అంతర్యం ఏంటని బన్నీ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఈ నాగబాబు చేసిన ఈ పోస్ట్ ట్విట్టర్‌లో రచ్చ లేపింది. బన్నీ ఫ్యాన్స్ ముక్కుముడిగా ప్రతి ట్వీట్ చేస్తూ నాగబాబుకు కౌంటర్ ఇస్తున్నారు. బన్నీని పరోక్షంగా తమ వాడు కాదు అనడం సరైనది కాదని, మరే అయితే ఎన్నికల ముందే ఈ ట్వీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గతంలో అల్లు అర్జున్ జనసేనకు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వలేదా? పరాయి వాడైతే ఎందుకు అంత సాయి చేస్తారంటూ గుర్తుచేస్తున్నారు.
చిరంజీవి సలహా మేరకేనా?
ఇలా సోషల్ మీడియాలో నాగబాబుపై ట్వీట్‌ప బన్నీ ఫ్యాన్స్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు రగడ లేపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మాత్తుగ నాగబాబు ట్విట్టర్ ఖాదా మాయమైంది. ఆయన ప్రోఫైల్ సెర్చ్ చూడగా ఈ అకౌంట్ వాడుకలో లేదు (This Account Doesn't exist) అని దర్శనం ఇచ్చింది. దీంతో ఇప్పుడిది హాట్‌టాపిక్‌గా నిలిచింది. బన్నీపై చేసిన పరోక్ష కామెంట్స్‌తో ఫ్యాన్స్ దాటికి నాగబాబు ఈ అకౌంట్ డిలిట్ చేశాడంటూ మళ్లీ చర్చ మొదలైంది. అయితే తాజాగా బజ్ ప్రకారం ఈ వ్యవహరంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారట. చిరంజీవి ఈ విషయమై నాగబాబుతో మాట్లాడారట. ఈ ట్వీట్ డిలిట్ చేసి ఈ వివాదాన్ని సద్దుమనిగించమని సూచన ఇచ్చారట. కానీ నాగబాబు ఏకంగా తన ట్విటర్ ఖాతానే డిలిట్ చేసి పూర్తిగా వివాదానికి చెక్ పెట్టాడు.
Also Read: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ - NTR31 టైటిల్ ఇదేనట!