Suriya's Kanguva war sequence: హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'కంగువా'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2024లో రిలీజ్ అయ్యే టాప్ సినిమాల్లో 'కంగువా' కూడా ఒకటి. అయితే, ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ అందరిలో సినిమాపై ఇంట్రస్ట్ పెంచేస్తోంది. అదే సూర్య, బాబి డియోల్ మధ్య జరిగే యుద్ధం. ఆ సీన్ ఒక రేంజ్ లో తెరకెక్కించారట మేకర్స్.
10 వేల మందితో..
ఇది రెండు పీరియడ్స్‌లో జరిగే కథ. ఈ సినిమాలో సూర్య ప్రొటగానిస్ట్‌గా, బాబీ డియోల్ ప్రైమరీ యాంటగానిస్ట్ గా చేస్తున్నారు. అయితే, వాళ్లిద్దరి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను ఈ మధ్యే తెరకెక్కించారట. పది వేలమందితో ఈ సీన్స్ చిత్రీకరించారట. "స్టూడియో గ్రీన్, మేకర్స్, డైరెక్టర్ శివ, టీమ్‌తో కలిసి అద్భుతమైన వార్ సీక్వెన్స్ రూపొందించారు. దీనికి సంబంధించి ప్రతి విషయంలో అంతా చాలా కష్టపడి పనిచేశారు. దీంతో ఒక రేంజ్ లో, పెద్ద వార్ సీక్వెన్స్ ఉంది. దాన్ని పదివేల మందితో అద్భుతంగా తెరకెక్కించారు. యాక్షన్, స్టంట్స్, విజువలైజేషన్, వార్ ఎపిసోడ్లు ప్రతీది ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్ తీశారు. క్వాలిటీ, పర్ఫెక్షన్ కోసం వాళ్ల పర్యవేక్షణలో చేశారు" అని ప్రొడక్షన్ లో ఉండే కీలక వ్యక్తి వెల్లడించాడు.
ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..
శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆడియన్స్ కి ఈ సినిమా కొత్త విజువల్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుందని, పవర్ ఫుల్ ఎమోషన్స్ తో ఉంటుందని సిని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సూర్య, బాబి డియోల్ కి సంబంధించి పవర్ ఫుల్ పర్ఫామెన్స్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అందరూ. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాకి వెట్రి పలని స్వామి సినిమాటోగ్రఫీ కాగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ నటి దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ వరల్డ్ చిత్రంగా ఈ మూవీ పది భాషల్లో విడుదల కానుంది.
ఆకట్టుకున్న పోస్టర్..
ఈ సినిమాకి సంబంధించి సరైన అప్ డేట్స్ మేకర్స్ ఇవ్వలేదు. అయితే, ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించలేదు. దీంతో ఎప్పుడెప్పుడు రీలీజ్ అవుతుందా అని ప్రేక్షకుల ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ అందరిలో ఆసక్తి రేపుతోంది. దాంట్లో సూర్య రెండు గెటప్ లలో కనిపించారు. ఒకవైపు సూటులో స్టైలిష్‌గా, ఇంకో వైపు యుద్ధ వీరుడిలా కనిపించాడు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అంటూ వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు ఈ యుద్ధం గురించి అప్ డేట్ లీక్ అవ్వడంతో ఏ రేంజ్‌లో ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ.
Also Read: దేవర ఫస్ట్ సాంగ్ ప్రోమో - 14 సెకన్స్ క్లిప్ చూస్తే పూనకాలే, ఫుల్ సాంగ్ వస్తే ఇంకెలా ఉంటుందో!