Animal - Ranbir Kapoor About Film Fare Award: ర‌ణ్ బీర్ క‌పూర్.. 'యానిమ‌ల్' సినిమాలో త‌న‌దైన శైలిలో న‌టించి ఎంతోమందిని మెస్మ‌రైజ్ చేశారు. ఈ సినిమాలో ర‌ణ్ బీర్ క‌పూర్ క్యారెక్ట‌ర్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. త‌న పాత్ర‌కు న్యాయం చేశారు ర‌ణ్ బీర్. ఇక దానికిగాను ఆయ‌న‌కు ఫిలిమ్ ఫేర్ అవార్డు వ‌చ్చింది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న ర‌ణ్ బీర్ క‌పూర్ స్పీచ్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. జ‌న‌వ‌రి 28న జ‌రిగిన ఈ అవార్డు వేడుక‌.. ఆదివారం సాయంత్రం టెలికాస్ట్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. త‌న అవార్డును ముగ్గురికి అంకితం చేస్తున్న‌ట్లు చెప్పారు.


వారికే నా అవార్డు అంకితం.. 


హిందీ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఫిల్మ్ ఫేర్ ఒకటి. ప్రతి ఏడాది ఘనంగా ఆ అవార్డుల వేడుక జరుగుతుంది. 69వ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్ 2024 ఈవెంట్ ఈ ఆదివారం సాయంత్రం ప్ర‌సార‌మైంది. ఈ సంద‌ర్భంగా ర‌ణ్ బీర్ క‌పూర్ మాట్లాడుతూ... "నేను అహ్మ‌దాబాద్ లో ల్యాండ్ అవ్వ‌గానే వీధుల‌న్నీ హిందీ ఫిలిమ్ బ్యాన‌ర్స్ తో వెలిగిపోయింది. చాలా ఎమోష‌న‌ల్ గా అనిపించింది. ఇంత చేసిన గుజ‌రాత్ గ‌వ‌ర్న‌మెంట్ కి నా ధ‌న్య‌వాదాలు. ఇక ఈ అవార్డును నా జీవితంలోని ముగ్గురు ముఖ్య‌మైన వ్య‌క్తుల‌కు అంకితం ఇస్తున్నాను.ఈ సినిమా ఛాంపియ‌న్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ‌, మీరే ఆల్ఫా, నేను చేసిన డైరెక్ట‌ర్ల‌లో మీరు నిజ‌మైన సినిమాటిక్ డైరెక్ట‌ర్. మీతో కొలాబ‌రేట్ అయినందుకు గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. నువ్వు నా మీద పెట్టుకున్న న‌మ్మ‌క‌మే న‌న్ను గెలిపించింది. నువ్వు గెలిచావు" అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు ర‌ణ్ బీర్. 


రిషీ క‌పూర్ ని గుర్తుచేసుకున్న ర‌ణ్ బీర్.. 


ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌ తండ్రికి కూడా థ్యాంక్స్ చెప్పారు. ఈ అవార్డును ఆయ‌న‌కు కూడా అంకితం ఇస్తున్న‌ట్లు చెప్పారు. “ఈ అవార్డు అంకితం ఇవ్వాల‌నుకుంటున్న రెండో వ్య‌క్తి మా నాన్న రిషీ క‌పూర్. పాపా మేరీ జాన్.. ప్ర‌తి రోజు మీ గురించి ఆలోచిస్తాను. ప్ర‌తి విష‌యంలో గుర్తు చేసుకుంటాను. నేను ఇవ్వాల్సిన ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు ఈ పార్ట్ ద్వారా ఇస్తున్నాను అనుకుంటున్నాను. మీరు అక్క‌డ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు అనుకుంటున్నాను” అని తండ్రిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రణబీర్.


నా కూతురికి కూడా.. 


ఇక ఈ అవార్డును ర‌ణ్ బీర్ త‌న కూతురి రాహాకి కూడా అంకితం ఇచ్చారు. య‌నిమ‌ల్ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న టైంలోనే రాహా పుట్టింది. “లాస్ట బ‌ట్ నాట్ లీస్ట్.. రాహా.. అల్ల‌రి పిల్ల‌. నేను షూటింగ్ స్టార్ట్ చేసిన వారానికి నువ్వు పుట్టావు. ప్ర‌తి రోజు నీ కోసం ఇంటికి రావ‌డం నా జీవితంలోనే ఆనందించిన క్ష‌ణాలు. అమ్మ‌, నాన్న నీతో ఆడుకునేందుకు అవార్డులు అనే అత్త‌, మామ్మ‌ను తీసుకొస్తున్నారు. నీతో ప్ర‌తి అడ్వంచ‌ర్ ని ఎంజాయ్ చేయాల‌ని వేచి చూస్తున్నాను. ల‌వ్యూ అల్ల‌రి పిల్ల‌. థ్యాంక్యూ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ ఇంక సినిమాల్లో క‌లుసుకుందాం” అంటూ త‌న స్పీచ్ ముగించారు ర‌ణ్ బీర్. 


జ‌న‌వ‌రి 28న జ‌రిగిన ఈ ఫంక్ష‌న్ ని ఆదివారం ప్రసారం చేశారు. కాగా.. ఈ అవార్డు ఫంక్ష‌న్ లో ప్ర‌త్యేక డ్యాన్స్ ప‌ర్ఫామెన్స్ లు అల‌రించాయి. ఈ వేడుకకు కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా, మనీష్ పాల్ వంటి సినీ ప్రముఖులు హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ఇక బాలీవుడ్ స్టార్స్ ప‌ర్ఫామెన్స్ లు మిన్నంటాయి.  


Also Read: కలెక్షన్స్ వసూళ్లలో ‘ఈగల్’ ఢమాల్ - రవితేజను వెంటాడుతోన్న ఫ్లాప్స్, నష్టం ఎంతంటే?