నటీనటులకు ప్రతిసారి సక్సెస్ ఫుల్ స్క్రిప్ట్ పట్టడం అంటే కష్టమే. కొన్నిసార్లు బ్లాక్ బస్టర్ అనుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడతాయి. మరికొన్నిసార్లు అసలు ఆడుతుందా అనే అనుమానం ఉన్న సినిమాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తాయి. కొన్నిసార్లు మాత్రమే స్టార్స్ అనుకున్న విధంగా సినిమాలు ఆడతాయి. ఇలా జరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం హీరోలు తాము చేసిన సినిమాల గురించి రిగ్రెట్ ఫీల్ అవుతారు. అలా టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ఫీలైన మూవీ ఏంటో తెలుసా? 

Continues below advertisement


డిజాస్టర్ మూవీపై రానా కామెంట్స్ 
రానా దగ్గుబాటి 'బాహుబలి' మూవీతో పాన్ ఇండియా స్టార్ డం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత రానా సినిమాల జోరును తగ్గించారు. మరోవైపు నిర్మాతగా మారి కంటెంట్ బేస్డ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 'బాహుబలి' కంటే ముందే రంఆ చేసిన మూవీ 'బెంగళూరు డేస్'. విడుదలైన దశాబ్దం తర్వాత కూడా మలయాళ మూవీ 'బెంగళూరు డేస్' ఓ క్లాసిక్ మూవీగా సినిమా చరిత్రలో మిగిలిపోయింది. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలీ, ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్, పార్వతి తిరువోతు వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమాను తమిళంలో 'బెంగుళూరు నాట్కల్' పేరుతో రీమేక్ చేశారు. కానీ రీమేక్ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. రీమేక్ మూవీలో ఆర్య, బాబి సింహ, శ్రీదివ్య, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ నటించారు.



Also Readచైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ... హీరోయిన్ సూసైడ్ అటెంప్ట్‌తో వార్తల్లోకి ప్రేమ కహానీ... హీరోగా హిట్స్ వచ్చినా ఇప్పుడు ఛాన్సుల్లేవ్




ఏ ఓటీటీలో ఉందంటే ? 
ఒరిజినల్ వెర్షన్ 'బెంగుళూరు డేస్' ఇంటెన్స్ ఎమోషన్స్, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ వంటి అంశాల కారణంగా ప్రేక్షకులపై మంచి ఎఫెక్ట్ చూపించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన తమిళ వెర్షన్ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆయనకు అవకాశాలే లేకుండా పోయాయి. అక్కినేని అఖిల్ - పూజా హెగ్డేతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీతో ఆయనకు హిట్ ట్రాక్ ఎక్కడానికి ఐదేళ్లు పట్టింది. ఇక మలయాళ చిత్రం 'బెంగళూరు డేస్' ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 


Also Read: చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమాకు టైటిల్ ఇచ్చిన దర్శకేంద్రుడు... ఫిక్స్ అయితే మెగా ఫ్యాన్స్‌కు పండగే