'సంక్రాంతికి వస్తున్నా' మూవీ సక్సెస్ తో జోరు మీదున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో నెక్స్ట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్వయంగా చిరంజీవి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వగా, త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిరంజీవి మూవీ టైటిల్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెల్లడించారు. 


పట్టాలెక్కక ముందే టైటిల్ లీక్ 
వరుస హిట్లతో దూసుకెళ్తున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ఫేవరెట్ హీరోలతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వెంకటేష్, బాలయ్య వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేసి వరుస హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయతుండడంతో, ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ప్రమోషన్లలోనే అనిల్ రావిపూడి నెక్స్ట్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్టు చెప్పేశారు. కానీ మెగా అభిమానులు మాత్రం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేశారు. చిరు నోటి నుంచే స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా రావడంతో ఆ పని కూడా అయిపోయింది. 


ఈ నేపథ్యంలోనే మూవీ ఇంకా పట్టాలు కూడా ఎక్కకముందే ఈ మూవీ టైటిల్ విషయం బయటకు రావడంతో వైరల్ అవుతోంది. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీకి 'సంక్రాంతి అల్లుడు' అనే టైటిల్ ని పెట్టాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆయన సజెస్ట్ చేసినట్టుగా ఇదే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేస్తే, సరిగ్గా సంక్రాంతి సీజన్ కు పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అవుతుంది ఈ మూవీ. మరి అనిల్ రావిపూడి, చిరంజీవి ఈ మూవీ టైటిల్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.


Also Read: మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... రామ్ చరణ్ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్న మేకర్స్


అనిల్ రావిపూడి మూవీ అనౌన్స్మెంట్ 
'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మెగా అనౌన్స్మెంట్ అంటూ ప్రకటించారు. తన 157వ సినిమాను అనిల్ రావిపూడితో చేయబోతున్నామని చిరు వెల్లడించారు. తన కూతురు సుష్మిత, 'లైలా' మూవీ ప్రొడ్యూసర్ సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించబోతున్నారని చిరు వెల్లడించారు. అంతేకాదు వేసవిలో అనిల్ రావిపూడితో మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని ఆయన తెలిపారు. ఇక ఈ మూవీ కంప్లీట్ గా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎగ్జైటింగ్ గా ఉందని స్వయంగా చిరంజీవి వెల్లడించడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.


శ్రీకాంత్ ఓదెల కంటే ముందే... 
ఇప్పటికే చిరంజీవి 'విశ్వంభర' మూవీలో నటిస్తుండగా, చిరు 157 మూవీని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్నారు. చిరు 158 సినిమాను అనిల్ రావిపూడితో చేయాల్సి ఉంది. కానీ ఓదెలతో మూవీకి టైమ్ పట్టే ఛాన్స్ ఉండడంతో, ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి, ముందుగా తన 157వ సినిమాను అనిల్ రావిపూడితో చేయడానికి మెగాస్టార్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. పైగా 2026 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ముందే చెప్పేశారు చిరు. 


Read Also : ఇండస్ట్రీ అంతా ఒక్కటే కాంపౌండ్... బాలకృష్ణ, తారక్ అంటాడని విశ్వక్ ఫంక్షన్‌కు వెళ్లకూడదా? - చిరంజీవి