The Great Pre Wedding Show Movie Launch: యంగ్ హీరో తిరువీర్‌, ‘క‌మిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ టీనా శ్రావ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’. హైదరాబాద్ సిటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సందీప్‌ ఆగరం, అష్మితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా మహూర్తపు సన్నివేశానికి నటుడు రానా దగ్గుబాటి క్లాప్ కొట్టారు. సందీప్‌ ఆగరం కెమెరా స్విఛాన్‌ చేశారు. వైవిధ్యభరిత పాత్ర‌లు, సినిమాల‌తో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.


నవంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్


‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక విషయాలు వెల్లడించారు. నవంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు ద‌ర్శ‌కుడు రాహుల్ శ్రీనివాస్ తెలిపారు. “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. నవంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఎస్‌ కోట‌, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుప‌బోతున్నాం. ఈ అవకాశం కల్పించిన హీరో తిరువీర్‌ కు,  నిర్మాత‌లు సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డికి ధ‌న్య‌వాదాలు’’ అని చెప్పుకొచ్చారు.   


కామెడీ డ్రామాగా ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’


అటు నిర్మాతలు సందీప్ అగరం, అష్మితా రెడ్డి ఈ మూవీ గురించి కీలక విషయాలు వెల్లడించారు. కామెడీ డ్రామా జోనర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. “ఈ సినిమాకు సపోర్టు చేయడానికి వచ్చిన రానాతో పాటు ఇతర ప్రముఖులకు ధన్యవాదాలు తేలియజేస్తున్నాం. కామెడీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ సరికొత్త పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది” అని చెప్పుకొచ్చారు.


Also Read: జిగ్రా రివ్యూ: యాక్షన్ అవతార్‌లో ఆలియా భట్ - ఇంతకీ సినిమా ఎలా ఉంది?



త్వరలో రిలీజ్ డౌట్ అనౌన్స్


ఇక ఈ సినిమాలో తిరువీర్‌, టీనా శ్రావ్య, రోహ‌న్ రాయ్‌, న‌రేంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలు వహిస్తున్నారు. బై 7పి.ఎంప్రొడ‌క్ష‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్లపై స‌ందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి, ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ బాధ్యతలను  ఎస్‌.సోమ‌శేఖ‌ర్‌ చూసుకుంటున్నారు. క‌ళ్యాణ్ నాయ‌క్‌ ఎడిట‌ర్‌ గా వ్యవహరిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ గా  ప‌్ర‌జ్ఞ‌య్ కొనిగారి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ గా ఫ‌ణి తేజ ముసి, కాస్ట్యూమ్ డిజైన‌ర్లుగా ఆర‌తి విన్న‌కోట‌, ప్రియాంక్ వీర‌బోయిన‌ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా షూట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం అనుకున్నట్లుగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.


Also Read'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?