కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి, ప్రయోగాలకు ఎప్పుడూ ఒక అడుగు ముందుండే యంగ్ హీరోలలో రామ్ పోతినేని (Ram Pothineni) ఒకరు. తాను సినిమా చేయబోయే దర్శకుడి ట్రాక్ రికార్డ్, సక్సెస్ - ఫెయిల్యూర్ వంటివి ఆయన పట్టించుకోరు. ప్రస్తుతం 'ఆంధ్రా కింగ్ తాలూకా' చిత్రీకరణలో బిజీగా ఉన్న రామ్... ఆ తర్వాత కొత్త దర్శకుడితో పనిచేయడానికి రెడీ అవుతున్నారు.
బాహుబలి నిర్మాతలతో రామ్ సినిమా!అవును... బాహుబలి వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ తీసిన ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాణ సంస్థలో యంగ్ హీరో రామ్ పోతినేని ఒక సినిమా చేయబోతున్నారు. నిర్మాతలతో చర్చలు పూర్తి అయ్యాయి. సినిమా చేసేందుకు అంత రెడీ.
ప్రస్తుతం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' వంటి హిట్ తీసిన మహేష్ బాబు పి దర్శకత్వంలో 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా చేస్తున్న రామ్... దాని తర్వాత ఆర్కా మీడియా వర్క్స్ సంస్థల సినిమా చేస్తారని తెలిసింది.
కొత్త దర్శకుడి కథకి ఓటు వేసిన రామ్!రామ్ పోతినేని కథానాయకుడిగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించే సినిమాతో కొత్త దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. కిషోర్ గోపు చెప్పిన కథకు రామ్ పోటు వేశారని తెలిసింది. వచ్చే ఏడాది... జనవరి 2026లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. కథ, హీరోయిన్, టెక్నీషియన్స్ వంటి ఇతర వివరాలు త్వరలో వెల్లడి అవుతాయి. ఈ ఏడాది నవంబర్ 28న 'ఆంధ్రా కింగ్ తాలూకా' విడుదల అవుతుంది. ఆ తర్వాత కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతాయి.
Also Read: అషు రెడ్డి ఒంటిపై పచ్చబొట్టు... పవన్ కళ్యాణ్ టాటూను చూపించిన బిగ్ బాస్ బ్యూటీ
'కందిరీగ' సినిమాతో సినిమాటోగ్రాఫర్ సంతోష్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు రామ్. 'నేను శైలజ' సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. దానికి ముందు ఆయన తీసిన 'సెకండ్ హ్యాండ్' అంత కమర్షియల్ సక్సెస్ కాదు. అయినా సరే కథపై, దర్శకుడిపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చారు రామ్. 'ఇస్మార్ట్ శంకర్' విడుదలకు ముందు పూరి జగన్నాథ్ ఫ్లాపుల్లో ఉన్న పట్టించుకోలేదు. జయాపజాల కంటే కథను నమ్మి అవకాశాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు రామ్.
Also Read: మళ్ళీ వార్తల్లో మృణాల్ ఠాకూర్... అనుష్క మీద కామెంట్స్... మండిపడుతున్న బాలీవుడ్ ఆడియన్స్!