Bigg Boss Telugu Season 9 Contestants List : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 సెలబ్రెటీలు లిస్ట్ రెడీ అయిపోయింది. కామనర్స్ కోసం చేస్తోన్న అగ్నిపరీక్షకు ప్రేక్షకుల్లో మంచి బజ్నే క్రియేట్ అవుతుంది. ముగ్గురు జడ్జ్‌లతో, విభిన్నమైన గేమ్స్‌తో కామనర్స్‌కు టాస్క్‌లు పెడుతూ వారిలో కొందరిని ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే కొందరు సెలబ్రెటీలను బిగ్‌బాస్ హౌజ్‌లోకి తీసుకొస్తున్నారు టీమ్. వీరిలో ప్రభాస్ హీరోయిన్‌తో పాటు మెగా ఫ్యామిలీ ఆప్తుడు కూడా ఉన్నారు. మరి ఆ లిస్ట్ ఏంటో చూసేద్దాం.
భరణి కుమార్
సీరియల్ యాక్టర్, మెగా ఫ్యామిలీకి ఆప్తుడైన భరణి కుమార్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. చిలాసౌ స్రవంతితో భరణి కుమార్‌కి ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. వైజాగ్‌కి చెందిన భరణి పలు సీరియల్స్‌లో, సినిమాల్లో చేశారు. అలాగే మెగా ఫ్యామిలీకి బాగా ఆప్తుడని.. నాగబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయనే బజ్ కూడా గట్టిగానే వినిపిస్తుంది.
ఆషా షైనీ
హీరోయిన్ ఆషా షైనీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. లక్స్ పాప సాంగ్ తెలిసిన వారికి బాగా పరిచయం ఉంటుంది. నువ్వు నాకు నచ్చావు సినిమాలో సెకండ్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చంఢీఘర్‌కు చెందిన ఈమె వయసు 46 ఏళ్లు. ఈమెకి ప్రస్తుతం ఆడియన్స్‌లో పెద్ద క్రేజ్ లేదు కానీ.. గేమ్ తర్వాత సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వొచ్చు.
రాము రాథోడ్
బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్తోన్న మరో సెలబ్రెటీ రాము రాథోడ్. ఇతను ఫోక్ సింగర్, డ్యాన్సర్. ఇతని పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆయన పాటలు బాగా ఫేమస్ అయ్యాయి. 'రాను బొంబాయికి రాను'. 'సొమ్మసిల్లి పోతుండవే' అనే సాంగ్స్ ఇతనివే. సోషల్ మీడియాలో ఇతనికి మంచి ఫాలోయింగే ఉంది.
సంజనా గర్లానీ
బుజ్జిగాడు మూవీ ఫేమ్ సంజనా గర్లానీ. ఈమె అసలు పేరు అర్చనా మనోహర్ గర్లానీ. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ సరసన సెకండ్ హీరోయిన్గా చేసింది. అయితే ఈ భామ కూడా బిగ్‌బాస్ హోజ్‌లోకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈమెకు కూడా ప్రస్తుతం పెద్ద ఫాలోయింగ్ ఏమి లేదు.
శ్రేష్టీ వర్మ
ఈమె ఓ సెన్సేషనల్ కొరియోగ్రాఫర్. శ్రేష్టీ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. జానీ మాస్టర్‌పై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టిన అమ్మాయే ఈ కొరియోగ్రాఫర్. మరి ఈమె షోలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఎదురు చూడాల్సి ఉంది.
ఇమ్మాన్యుయేల్
కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కూడా బిగ్‌బాస్‌లోకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వేరే టీవీని వదిలి స్టార్మాకి ఇందుకే వచ్చాడని చెప్తున్నారు. ప్రస్తుతం స్టార్‌మాలో కుకు విత్ జాతి రత్నాలు ప్రోగామ్లో చేస్తున్నాడు. ఆదివారం స్టార్ మా పరివారంలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇతనికి జబర్దస్త్ నుంచే మంచి క్రేజ్ ఉంది. అప్పట్లో వర్షతో చేసిన లవ్ ట్రాక్ బాగానే వర్క్ అవుట్ అయింది.
సుమన్ శెట్టి
7/G బృందావన కాలనీ, జయం ఫేమ్ సుమన్ శెట్టి కూడా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట.
అలేఖ్య చిట్టి పికిల్స్
సోషల్ మీడియాలో బూతులతో ఫేమస్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ పాప కూడా బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హౌజ్‌లో ఈమె ఎలాంటి కంటెంట్ ఇస్తుందో.. ఎంతమందికి మీమ్ మెటీరియల్ అవుతుందో వేచి చూడాల్సిందే.
అయితే వీరితో పాటు ముద్దమందారం ఫేమ్ తనూజ గౌడ కూడా బిగ్‌బాస్‌లోకి వస్తుందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. శుభం, కల్కీ మూవీ ఫేమ్ హర్షిత్ రెడ్డి కూడా వెళ్తాడనే వార్తలు వినిపించాయి కానీ అతను వెళ్లట్లేదట. కామనర్స్‌లో కూడా శ్రీజ, పవన్ కళ్యాణ్, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీశ్, మనీష్ వెళ్తారనే బజ్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ 9పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సెలబ్రిటీల, కామనర్స్ ఎంట్రీతో షో ఎంత రసవత్తరంగా మారుతుందో చూడాలి.