తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. అందాల భామలతో తనను తాను పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్ అని పేర్కొన్నది 'బిగ్ బాస్' బ్యూటీ అషు రెడ్డి (Ashu Reddy) అని చెప్పవచ్చు. పవన్ మీద తన అభిమానాన్ని పలు సందర్భాల్లో ఆవిడ బయట పెట్టింది. ఇవాళ పవన్ కళ్యాణ్ బర్త్ డే (Pawan Kalyan Birthday) సందర్భంగా మరోసారి బయటపెట్టింది.
అషు రెడ్డి ఒంటిపై పవన్ పేరుపవన్ కళ్యాణ్ అంటే అషు రెడ్డికి ఎంత ఇష్టం అంటే తన ఒంటి మీద ఆయన పేరును పచ్చ బొట్టుగా వేయించుకుంది. ఆ విషయం గతంలో చెప్పింది కూడా! అందరికీ చూపించేట్టు కాకుండా బాడీ మీద టాటూ వేయించారు అషు. ఎక్కడ అనేది ఒకానొక సందర్భంగా చెప్పగా పవన్ సిగ్గుపడ్డారని పేర్కొంది. ఈ రోజు పవన్ పుట్టినరోజు కావడంతో తన ఒంటి మీద పవన్ పేరు కనిపించేలా ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
''నువ్వు పుట్టిన ఈ భూమి మీద నేను జన్మించడం గర్వంగా ఫీలవుతున్నాను. ప్రజల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు'' అని అషు రెడ్డి పేర్కొన్నారు. సాధారణంగా తమ ప్రేమికులు లేదా లైఫ్ పార్ట్నర్స్ పేరును అక్కడ చాలా మంది టాటూ వేయించుకుంటారు. కానీ అషు రెడ్డి మాత్రం తన అభిమాన కథానాయకుడి పేరు టాటూగా వేయించుకున్నారు.
Also Read: బూతు బూతు... తెలుగులో మీనింగ్ చూడరా? ఆ టైటిల్ ఏంటి?
అషురెడ్డి ఒంటిపై పవన్ కళ్యాణ్ టాటూ కనిపించేలా దిగిన ఫోటో కింద కామెంట్స్ చూస్తే నెటిజనులు క్రియేటివిటీ చూపిస్తున్నారని అర్థం అవుతోంది. 'అక్కడ ఎవరు టాటూ వేశారో కానీ అదృష్టవంతుడు' అని ఒకరు కామెంట్ చేయగా... 'లక్కీయస్ట్ టాటూ ఆర్టిస్ట్' అని మరొకరు కామెంట్ చేశారు. 'వైట్ బ్యూటీ' అంటూ మరొకరు అషు రెడ్డి అందాన్ని పొగుడుతున్నారు.
నితిన్, మెగా ఆకాష్ జంటగా నటించిన 'చల్ మోహన్ రంగా' సినిమాలో అషు రెడ్డి నటించారు. 'ఏవమ్'తో పాటు కొన్ని సినిమాలు, పలు టీవీ షోలు చేశారు. అయితే 'బిగ్ బాస్' వల్ల అషురెడ్డి ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతకు మించిన పాపులారిటీ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ వల్ల వచ్చింది.
Also Read: సొంత కుటుంబానికి దూరంగా ఎన్టీఆర్... కానీ అల్లు - కొణిదెల కుటుంబాలు కలిశాయ్!