మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) మీద తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానం చూపిస్తున్నారు. కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఆవిడ పేరు చెబితే మండి పడుతున్నారు. అంతెత్తున లేస్తున్నారు. మృణాల్ మాటలు సరిగా లేవని కొందరు, అసలు ఆవిడకు మాట్లాడటం రాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. తాజా వివాదంలోకి వెళితే...
అనుష్క శర్మకు సినిమాలు లేవ్...
మృణాల్ ఠాకూర్ వీడియో క్లిప్ వైరల్!
బాలీవుడ్ సీరియల్స్, సినిమాలతో మృణాల్ ఠాకూర్ కెరీర్ స్టార్ట్ చేశారు. 'సీతా రామం' కంటే ముందు హిందీలో సినిమాలు చేశారు. కొన్ని సినిమాల్లో ఛాన్సులు మిస్ చేసుకున్నారు. మృణాల్ ఠాకూర్ మిస్ అయిన సినిమాల్లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'సుల్తాన్' ఒకటి.
'సుల్తాన్'లో సల్మాన్ సరసన కథానాయికగా అనుష్క శర్మ నటించింది. అయితే ఆ అవకాశం అనుష్క కంటే ముందు మృణాల్ ఠాకూర్ దగ్గరకు వచ్చింది. చేతికి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. లేటెస్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో క్లిప్ చూస్తే ఆ మూవీ, ఛాన్స్ మిస్ కావడం గురించి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతున్నట్టు అర్థం అవుతోంది.
'సుల్తాన్' సినిమా లేదంటే అందులో హీరోయిన్ అనుష్క శర్మ పేరును మృణాల్ ఠాకూర్ అసలు ప్రస్తావించలేదు. కానీ ''ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడితే చాలా కాంట్రవర్సీలు అవుతాయి. ఒకవేళ నేను గనుక అప్పుడు ఆ సినిమా చేసి ఉంటే నన్ను నేను కోల్పోయేదాన్ని. ఇప్పుడు ఆవిడ సినిమాలు చేయడం లేదు. నేను చేస్తున్నాను. అదే నా విజయంగా భావిస్తాను. నాకు ఇన్‌స్టంట్ ఫేమ్, ఇన్‌స్టంట్ రికగ్నైజేషన్ వద్దు. ఇన్‌స్టంట్‌గా వచ్చేది ఏదైనా ఇన్‌స్టంట్‌గా పోతుంది'' అని మృణాల్ పేర్కొంది.
'జెర్సీ' సినిమా ప్రమోషన్స్ కోసం హిందీ 'బిగ్ బాస్' కార్యక్రమానికి వెళ్లిన సమయంలో 'సుల్తాన్'లో హీరోయిన్ పాత్రకు మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలించినట్టు సల్మాన్ ఖాన్ వెల్లడించారు. అందువల్ల, ఆ సినిమా గురించి మృణాల్ మాట్లాడి ఉండొచ్చని నెటిజనులు అంటున్నారు. మృణాల్ నోరు పారేసుకోవడం ఆపితే మంచిదని కొందరు సలహాలు ఇస్తున్నారు.
Also Read: అషు రెడ్డి ఒంటిపై పచ్చబొట్టు... పవన్ కళ్యాణ్ టాటూను చూపించిన బిగ్ బాస్ బ్యూటీ
బిపాసా బసు గురించి మృణాల్ ఠాకూర్ ఆ మధ్య చేసిన కామెంట్స్ వైరల్ కాగా సారీ చెప్పింది. బిపాసా కంటే తాను అందంగా ఉంటానని మృణాల్ ఠాకూర్ ఓల్డ్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పట్ల నెటిజన్స్ మండిపడ్డారు. తెలిసీ తెలియని వయసులో అలా మాట్లాడానని, తనను క్షమించాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఆవిడ మరోసారి ఓల్డ్ ఇంటర్వ్యూ వల్ల వార్తల్లోకి వచ్చారు. అనుష్క శర్మకు అవకాశాలు రాక కాదని, ఫ్యామిలీకి టైం కేటయించాలని అనుకోవడం వల్ల సినిమాలు చేయడం లేదని, అది గుర్తించకుండా మృణాల్ ఠాకూర్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు.
Also Read: బూతు బూతు... తెలుగులో మీనింగ్ చూడరా? ఆ టైటిల్ ఏంటి?