OG Ticket Record: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవికి సంబంధించి వచ్చిన ప్రతి అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 02 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన అప్డేట్ అంతకుమించి వైబ్స్ క్రియేట్ చేస్తోంది. అభిమాన హీరోపై అభిమానాన్ని చాటుకున్న తీరు వైరల్ అవుతోంది. మోస్ట్ అవైటెడ్ మూవీ OG కి సంబంధించి ఫస్ట్ నైజాం టికెట్ 5 లక్షలకు అమ్ముడైనట్టు టాక్. ఈ టికెట్ ని పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా అభిమాన బృందం కొనుగోలు చేసిందట.
సెప్టెంబర్ 25న విడుదలకానున్న OG మూవీకోసం ప్రీ సేల్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వేసిన వేలంలో ఫస్ట్ టికెను 5 లక్షలకు కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ టికెట్ అమ్మగా వచ్చిన 5 లక్షల రూపాయలను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నట్టు అభిమానులు ప్రకటించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఓ సినిమా టికెట్ ధర 5 లక్షలు పలకడం ఓ రికార్డ్ అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమాపై ఉన్న బజ్ కి ఇదే నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజేతగా నిలిచి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షూటింగ్స్ కోసం టైమ్ కేటాయించేంత టైమ్ లేకపోయింది. అప్పటికే సెట్స్ మీదున్న హరిహరవీరమల్లు , ఓజీ షూటింగ్స్ ఎక్కడివక్కకే నిలిచిపోయాయి. అందుకే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదాపడుతూ వచ్చాయి. ప్రజాసేవలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కాస్త తీరిక చూసుకుని పెండంగ్ ప్రాజెక్ట్స్ పై కాన్సన్ ట్రేట్ చేశారు. హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తిచేయడం..ఆ మూవీ థియేటర్లలోకి రావడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత ఓజీ షూటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే సెప్టెంబర్ 25న OG మూవీ థియేటర్లలోకి రావడం పక్కా అని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. అదే రోజు అఖండ 2 కూడా వస్తుందని మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఈ రెండు సినిమాల్లో ఏదైనా వాయిదా పడుతుందేమో అనే టాక్ వచ్చింది. అఖండ 2 వాయిదా పడడంతో సెప్టెంబర్ 25న దసరా కానుకగా ఓజీ సింగిల్ గానే రాబోతోంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయ్. ఎన్నికల ప్రచారంలోనూ ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. OG బావుంటుంది, మీకు నచ్చుతుంది చూడండి అంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. ఇప్పటికే ఓజీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయ్. పవర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు OG రాబడుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. మి అందరి అంచనాలను పవన్ కళ్యాణ్ అందుకుంటారా..వెయిట్ అండ్ సీ...
వెండితెరపై పవర్ స్టార్ - రాజకీయాల్లో పీపుల్ స్టార్! పవన్ కి విశెష్ చెప్పిన నరేంద్ర మోదీ, చంద్రబాబు, లోకేష్, చిరంజీవి, అల్లు అర్జున్!... ఏమని పోస్ట్ పెట్టారో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి