పాన్ ఇండియా రిలీజ్... ఇప్పటి వరకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో వినిపించే మాట. పాన్ ఇండియా రిలీజ్ ట్రెండ్ మొదలైంది దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాతో! ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యారు.
120 దేశాలలో మహేష్ రాజమౌళి సినిమా విడుదల!SS Rajamouli Meets Kenya Cabinet Secretary Musalia W Mudavadi: సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనుల నిమిత్తం కెన్యా వెళ్లారు రాజమౌళి. అక్కడ ఆ దేశ క్యాబినెట్ సెక్రెటరీ ముసాలియా ముదవాదిని కలిశారు. రాజమౌళితో భేటీ అనంతరం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ముసాలియా తమ దేశాన్ని SSMB29 చిత్రీకరణకు ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈస్ట్ ఆఫ్రికా అంతటా పర్యటించిన రాజమౌళి టీం చివరకు తమ దేశాన్ని ఎంపిక చేసుకుందని కాస్త సంతోషంతో చెప్పారు.
Also Read: అషు రెడ్డి ఒంటిపై పచ్చబొట్టు... పవన్ కళ్యాణ్ టాటూను చూపించిన బిగ్ బాస్ బ్యూటీ
కెన్యాలో రాజమౌళి షూటింగ్ చేస్తారని తెలిపిన ముసాలియా... ఆ తరువాత సినిమా విడుదల గురించి కూడా పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలలో SSMB29 విడుదల అవుతుందని తెలిపారు. 100 కోట్ల మందికి పైగా సినిమా చూస్తారని చెప్పారు. అటువంటి సినిమా చిత్రీకరణ తమ దేశంలో జరుగుతుండడం ఎంతో సంతోషంగా ఉందని వివరించారు.
Also Read: మళ్ళీ వార్తల్లో మృణాల్ ఠాకూర్... అనుష్క మీద కామెంట్స్... మండిపడుతున్న బాలీవుడ్ ఆడియన్స్!
రాజమౌళి సినిమా చిత్రీకరణ కోసం మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం కెన్యా బయలుదేరారు ఆయన కుమారుడు గౌతమ్ తండ్రితో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. ఈ సినిమాలో నటిస్తున్న గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం కెన్యాలో దిగిన ఫోటోలను షేర్ చేశారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ స్టార్ మాధవన్ సైతం ఈ సినిమాలో నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.