టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరోలలో రామ్ పోతినేని (Ram Pothineni) ఒకరు. ఆయన సినిమాల్లో కథానాయికగా నటించడానికి హీరోయిన్ల ఇంట్రెస్ట్ చూపిస్తారు. రామ్ సినిమాలు గమనిస్తే... యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్లు తప్పకుండా ఉంటారు. కొత్త సినిమాలో కూడా ఒక క్రేజీ హీరోయిన్ సెలెక్ట్ అయింది.
రామ్ పోతినేని జంటగా భాగ్యశ్రీ బోర్సే
రామ్ పోతినేని కథానాయకుడిగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' వంటి డీసెంట్ హిట్ ఫిల్మ్ తీసిన మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఎంపిక అయింది. ఆ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు భాగ్యశ్రీ బోర్సే పరిచయం అయ్యింది. మొదటి సినిమాతో ఆవిడకు మంచి పేరు వచ్చింది. ఒక వైపు గ్లామర్... మరొక వైపు హీరోలతో పాటు అదే గ్రేస్, జోష్, హుషారుతో స్టెప్పులు వేయగల టాలెంట్... అలాగే యాక్టింగ్... వెరసి మొదటి సినిమాతో భాగ్యశ్రీ బోర్సే పేరు వైరల్ అయింది. ఇప్పుడు రామ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చూస్తే... హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని కంటే ముందు ఆయన తీసిన 'రారా కృష్ణయ్య' సినిమాలోనూ అంతే. ఇప్పుడు ఈ సినిమాలోనూ భాగ్యశ్రీ బోర్సే పాత్రకు మంచి వెయిట్ ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: ఓపెనింగ్స్ కోటి రాలేదు కానీ ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా - వరుణ్ తేజ్ నిర్మాతలకు ఇదొక్కటీ ప్లస్!
Ram Pothineni teams up with Mythri Movie Makers for #RAPO22: రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరోగా రామ్ 202వ సినిమా కనుక RAPO 22 అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. పూసి తర్వాత ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది తెలియజేయనున్నారు.
Also Read: నాగ చైతన్య ఒకలా, శోభిత మరోలా... శుభ లేఖలు పంచుతున్న అక్కినేని, ధూళిపాళ ఫ్యామిలీలు, ఆ రెండూ చూశారా?
Bhagyashri Borse Upcoming Movies: 'మిస్టర్ బచ్చన్' విడుదలకు ముందు మరో రెండు అవకాశాలను భాగ్యశ్రీ అందుకుంది. యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ జోడీగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఆవిడ నటిస్తోంది. అది కాకుండా దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'కాంత'లో కూడా ఆవిడ కథానాయక. ఇప్పుడు రామ్ 22వ సినిమా. భాగ్యశ్రీ జోరు చూస్తుంటే మరిన్ని సినిమా అవకాశాలు అందుకోవడం మాత్రమే కాదు... త్వరలో స్టార్ హీరోలు అందరి సరసన నటించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.