Ram Pothineni Fitness Journey: నటీనటులు ఎప్పటికప్పుడు తమ సినిమాల కోసం రూపాలు మార్చుకుంటూ ఉండాలి. లుక్స్ పరంగా, ఫిజిక్ పరంగా ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. దానికోసం రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లాలి, వర్కవుట్స్ చేయాలి. యంగ్ హీరో రామ్ పోతినేని కూడా తన అప్‌కమింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం అలాగే కష్టపడ్డాడు. రెండు నెలల్లో ఏకంగా 18 కిలోల బరువు తగ్గినట్టు తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఇక ఈ బరువు తగ్గడం కోసం ఎంత కష్టపడ్డాడో తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి మరీ ఫ్యాన్స్‌కు చూపించాడు ఈ చాక్లెట్ బాయ్. దీంతో రామ్ కష్టాన్ని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
ఇస్మార్ట్ శంకర్ కష్టం..
రామ్ చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘స్కంద’ మూవీలో నటించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించలేక యావరేజ్ హిట్‌గా నిలిచింది. 2019లో విడుదలయిన ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ ఇచ్చిన పూరీ జగన్నాధ్‌తోనే ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ ప్లాన్ చేశాడు. ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించాడు. అయితే ‘స్కంద’ తర్వాత గ్యాప్ తీసుకొని బ్యాంకాక్ వెళ్లినట్టు, అక్కడ ఇస్మార్ట్ శంకర్‌లాగా కనిపించడానికి కష్టపడినట్టు తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తెలిపాడు రామ్ పోతినేని.
అంచనాలు అందుకోవాలి..
‘‘ఇస్మార్ట్ శంకర్ అనే క్యారెక్టర్ చాలా పాపులర్ కాబట్టి ఆడియన్స్‌కు దాని నుండి కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ క్యారెక్టర్‌కు కావాల్సిన ప్రతీది నేను పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి. అసలు కాంప్రమైజ్ అవ్వడానికి ఛాన్సే లేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్. అందుకే ఫిట్‌గా ఉన్న ఇస్మార్ట్ శంకర్‌లాగా కనిపించడం కోసం రెండు నెలలు స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యానని, దానివల్లే 18 కిలోల బరువు కూడా తగ్గానని తెలిపాడు. అంతే కాకుండా తన ఫిట్‌నెస్ జర్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘డబుల్ ఇస్మార్ట్ కోసం జిమ్ సెషన్స్ మొదలయ్యాయి. నేచురల్‌గా ఉండాలి, మంచి ఆహారం తినాలి’ అని తన ఫిట్‌నెస్ జర్నీ గురించి వివరించాడు.
Ram Pothineni Photos: రామ్ పోతినేని షాకింగ్ లుక్ - బాత్‌రూంలో టవల్‌తో ఫోటోలు షేర్ చేసిన ఉస్తాద్
ఎన్నో సినిమాలతో పోటీ..
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ను పూరీతో పాటు చార్మీ కలిసి నిర్మించారు. సంజయ్ దత్.. ఇందులో విలన్‌గా కనిపించనున్నాడు. ఆగస్ట్ 15న అరడజనుకు పైగా సినిమాలు పోటీగా ఉన్నా.. తమ సినిమాపై నమ్మకంతో ‘డబుల్ ఇస్మార్ట్’ను కూడా అదే రోజు రంగంలోకి దించనున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన ట్రైలర్, పాటలు చూస్తుంటే.. ‘ఇస్మార్ట్ శంకర్’కు ఇది పర్ఫెక్ట్ సీక్వెల్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రామ్ మాత్రమే కాదు.. పూరీ జగన్నాధ్ సైతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ‘లైగర్’ డిశాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ హీరో, దర్శకుడి ఆశలన్నీ ‘డబుల్ ఇస్మార్ట్’పైనే ఉన్నాయి.
Also Read: ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ విడుదల - ఈసారి యాక్షన్, రొమాన్స్ అంతా డబుల్