Ram Pothineni: రామ్ పోతినేని షాకింగ్ లుక్ - బాత్‌రూంలో టవల్‌తో ఫోటోలు షేర్ చేసిన ఉస్తాద్
Ram Pothneni Shared His GYM Photos: ఉస్తాద్ రామ్ పోతినేని తన కొత్త ఫోటోలు షేర్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్ కోసం జిమ్, స్టీమ్ సెషన్‌లు తీసుకున్నానంటూ అసలు విషయం చెప్పకొచ్చాడు.
అంతేiకాదు పోస్ట్ జిమ్ తర్వాత తన డైట్ మీల్‌ని ఏంటో కూడా చూపించాడు. కాగా సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే రామ్ అప్పుడప్పుడు ఇలా స్పెషల్ పోస్ట్స్‌తో ఫాలోవర్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంటాడు.
మొన్నటి లవ్‌స్టోరి చిత్రాల్లో చాక్లేట్ బాయ్‌లా కనిపించే రామ్ ఇస్మార్ట్ శంకర్‌లో మాస్‌లో లుక్‌లో కనిపించాడు. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ కోసం బీస్ట్ మోడ్‌లోకి మరాడు.
ఈ సినిమా కోసం ఏకంగా 18 కీలోలు తగ్గాడట. అంతేకాదు జిమ్‌లో గంటలు తరబడి కసరత్తులు చేస్తూ ఈ చాక్లేట్ బీస్ట్ లుక్‌లోకి మారాడు. డబుల్ ఇస్మార్ట్‌కు రెడీ అవుతున్న తన జిమ్ లుక్‌ని షేర్ చేశాడు.
ఈ ఫోటోలను Disappear - Reappear. Gym & Steam sessions for #DoubleiSmart. Go Natural, Eat Clean & Don’t forget to push your trainer! అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పూరీ కనెక్ట్స్ బ్యానరల్లో చార్మి, పూరీ జగన్నాథ్‌లు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని తన జిమ్ ఫోటోలు షేర్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది.