Ram Pothineni: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!

Double Ismart Shooting Update: రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. దీనిపై ఓ రూమర్ వినబడుతోంది. అందులో నిజం ఏమిటంటే?

Continues below advertisement

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇండస్ట్రీ జనాలు గానీ, ట్రేడ్ వర్గాలు గానీ స్థాయిలో ఆ సినిమా విడుదల ముందు వరకు ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఊహించలేదు. 

Continues below advertisement

'టెంపర్' తర్వాత పూరి జగన్నాథ్ తీసిన ఫిలిమ్స్ సూపర్ హిట్స్ అవ్వలేదు. కానీ, అతడి టాలెంట్ మీద రామ్ నమ్మకం ఉంచాడు. అతడి నమ్మకం వమ్ము కాలేదు. పూరి బ్లాక్ బస్టర్ తీశాడు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత 'లైగర్'తో పూరి ఖాతాలో డిజాస్టర్ పడింది. అయినా అతడితో సినిమా చెయ్యడానికి రామ్ ముందుకొచ్చాడు. 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' స్టార్ట్ చేశాడు. ఏ సినిమా అయినా చకచకా ఫినిష్ చేసే పూరి, ఈ సినిమా కంప్లీట్ చెయ్యడానికి టైమ్ తీసుకుంటున్నాడు. అందుకు రీజన్ రామ్ అని రూమర్స్ మొదలు అయ్యాయి.

'డబుల్ ఇస్మార్ట్' ఆగడానికి రామ్ కారణమా?
'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ ఆగడానికి రామ్ రీజన్ అని, రెమ్యూనరేషన్ ఇస్తే గానీ మిగతా షూటింగ్ చెయ్యనని పట్టుబట్టినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అసలు మ్యాటర్ వేరే అని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయ్. 'డబుల్ ఇస్మార్ట్' (Double Ismart)కు ఇంత రెమ్యూనరేషన్ అని ముందు మాట్లాడుకున్నా హీరోకి టోకెన్ అడ్వాన్స్ తప్ప ఇంకేమీ ఇవ్వలేదని తెలిసింది. అయినా డబ్బుల కోసం చూడకుండా రామ్ షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. నిర్మాతలపై భారం తగ్గించడానికి ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద 'డబుల్ ఇస్మార్ట్' చెయ్యడానికి అంగీకరించాడు. అదీ అసలు మ్యాటర్.

షూటింగ్ ఆగడానికి అసలు కారణం ఏమిటి?
ప్రజెంట్ మార్కెట్ సిట్యువేషన్ అంత బాలేదు. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఇంతకు ముందు సేల్ అయినట్టు ఇప్పుడు కావడం లేదు. ఎలక్షన్స్ సీజన్ కావడంతో ఫైనాన్స్ దొరకడం టైట్ అయ్యింది. అందువల్ల, షూటింగ్ ఆగిందని యూనిట్ క్లోజ్ సర్కిల్స్ చెబుతున్నాయి. కేవలం మూడు పాటలు, కొంత ప్యాచప్ వర్క్ తప్ప మేజర్ షూటింగ్ పోర్షన్ కంప్లీట్ కావడంతో లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రామ్ రెడీగా ఉన్నాడు. అయితే, షూట్ ఆగడంతో అతడిపై లేనిపోని రూమర్లు వచ్చాయి.

Also Read: బీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్... ఎర్త్ డే రోజున చెన్నైలో ఓ అందాల భామ ఏం చేసిందో చూశారా?


పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్'లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తారు. ఛార్మీతో కలిసి పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్'కు చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకూ మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యాలని డిసైడ్ అయ్యారట.

Also Read: విశ్వంభర ఇంటర్వెల్... మెగాస్టార్ కెరీర్‌లోనే బెస్ట్ బ్యాంగ్!

Continues below advertisement