మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో #HappyBirthdayChiranjeevi అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండవ్వుతోంది. ఆయన అభిమానులు చిరుకి బర్త్ డే విషెస్ చెప్పడంలో బిజీగా ఉన్నారు. తాజాగా చిరు తనయుడు రామ్ చరణ్ కూడా ఒక క్యూట్ ఫోటోతో తన తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపాడు.
చిరంజీవి తాత..
68వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా చిరు.. తన తనయుడు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు ఒక క్యూట్ ఫోటోను కూడా షర్ చేశాడు రామ్ చరణ్. ‘మన చిరుత (చిరంజీవి తాత)కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా తరపు నుంచి, కొణిదెల ఫ్యామిలీ నుంచి అందులోని చిన్న వ్యక్తి నుంచి మీకు ఎంతో ప్రేమను అందిస్తున్నాం’ అంటూ చిరంజీవిని ఈ బర్త్ డే పోస్టులో ట్యాగ్ చేశాడు రామ్ చరణ్. దీంతో పాటు చిరు.. తన మనవరాలు క్లిన్ కారాను ఎత్తుకున్న ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ ఫోటోలో క్లిన్ కారా మోహం కనిపించకుండా ఫేస్‌పై ఎమోజీ పెట్టాడు.
చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా Mega156 & Mega157 సినిమాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి తన కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ 156వ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో Mega156 మూవీ ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
''4 దశాబ్దాలుగా వెండితెరను శాసించిన లెగసీ! భావోద్వేగాలను రేకెత్తించే వ్యక్తిత్వం! ఆఫ్ స్క్రీన్ లోనూ సెలబ్రేట్ చేసుకునే వ్యక్తి.. 155 చిత్రాల తర్వాత, ఇప్పుడు #MEGA156 సినిమా ఒక మెగా రాకింగ్ ఎంటర్టైనర్ అవుతుంది'' అని మేకర్స్ ట్వీట్ చేసారు. ''ప్రేక్షకులను అలరించే, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ప్రయాణం.. ఆన్ స్క్రీన్ బ్రిలియెన్స్ కి, ఆఫ్ స్క్రీన్ మాగ్నానిమిటీకి నిర్వచనంగా నిలిచిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు'' అని పేర్కొన్నారు.
మెగా 157 అప్డేట్..
ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 157వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా గురించి తాజాగా అప్డేట్ బయటికొచ్చింది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ ముందుగా విడుదలయ్యి.. అందులో మరో అప్డేట్ గురించి సమాచారం ఉంది. ఈ పోస్టర్‌ను చూస్తుంటే చిరు నెక్స్‌ట్ మూవీ సోషియో ఫ్యాంటసీ జోనర్‌కు సంబంధించిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలావరకు ఈ అనుమానానే నిజమని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ‘బింబిసార’ అనే మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న వశిష్ట.. రెండో సినిమాకే చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.
Also Read: చిరు ‘మెగా’ కాన్సెప్ట్ - పంచ భూతాలతో చిరంజీవి ప్రయోగం, 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జోనర్‌లో!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial