గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరొక్కసారి దేశం పట్ల, మన దేశ రాజ్యాంగ వ్యవస్థ పట్ల తనకు ఎంత గౌరవం వుందనేది తన చర్యల ద్వారా ప్రజలకు చాటి చెప్పారు. ఇప్పుడు ఆయనది చాలా బిజీ షెడ్యూల్. లెజెండరీ ఫిల్మ్ మేకర్, తమిళ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ శంకర్ (Director Shankar)తో ఆయన 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్ సిటీలో ఆ సినిమా షూటింగ్ స్పీడుగా జరుగుతోంది. అయితే, ఎన్నికల కోసం షూటింగుకు ఒక్క రోజు బ్రేక్ ఇచ్చారు చరణ్. 


మండే ఎలక్షన్ హాలిడే... ప్రజెంట్ అప్డేట్ ఏమిటంటే?
గేమ్ ఛేంజర్' సినిమా కోసం ఆదివారం రామోజీ ఫిలిం సిటీలో రామ్ చరణ్ షూటింగ్ చేశారు. సాధారణంగా ఆదివారం షూటింగులకు హాలిడే ఇస్తారు. కాని చరణ్ షూట్ చేశారు. మండే ఎలక్షన్ వుండటం, తెలంగాణలో ఆయనకు ఓటు హక్కు వుండటంతో లోక్ సభ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేసి తన బాధ్యత చాటుకోవాలని అనుకోవడంతో మండే బ్రేక్ ఇచ్చారు. 


ప్రజెంట్ గచ్చిబౌలిలోని ఒక ఏరియాలో 'గేమ్ ఛేంజర్' షూట్ జరుగుతోంది. రామ్ చరణ్ సహా ఆర్టిస్టులు సీనియర్ నరేష్ (నరేష్ విజయకృష్ణ),ప్రియదర్శి, చైతన్య కృష్ణ, సత్య తదితరులు జాయిన్ అయ్యారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. 
'గేమ్ ఛేంజర్'లో సివిల్ సర్వీసెస్ అధికారిగా రామ్ చరణ్ క్యారెక్టర్ వుంటుందని కొన్ని రోజుల క్రితం చెప్పారు. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఆయన ఎన్నికల అధికారిగా కూడా కనిపిస్తారట. ఎలక్షన్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసినప్పుడు ఎన్నికల్లో ఓటు వెయ్యకపోతే బాగోదు కదా!


Also Read: మధ్యాహ్నం తర్వాత ఓటేసిన స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్ - ఎండను లెక్క చేయకుండా వచ్చిన తారలు


'గేమ్ ఛేంజర్' షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజుల నుంచి జోరుగా హుషారుగా సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు రెండు రోజులు, పవన్ కల్యాణ్ తరఫున పిఠాపురంలో ప్రచారం చెయ్యడానికి వెళ్లినప్పుడు ఒక రోజు షూటింగుకు బ్రేక్ ఇచ్చారు చరణ్. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు.


'గేమ్ ఛేంజర్' తర్వాత బుచ్చిబాబు సినిమా!
'గేమ్ ఛేంజర్' కంప్లీట్ అయ్యాక 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చెయ్యనున్నారు రామ్ చరణ్. ఆయన బర్త్ డే సందర్భంగా ఆ సినిమా అనౌన్స్ చేశారు. హీరోగా చరణ్ 16వ మూవీ అది. ఆ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. అది కాకుండా మరొక సినిమా కూడా చరణ్ స్టార్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయని టాక్. అది ఎవరితో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 


రామ్ చరణ్ కొత్త సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది? అనేది తెలుసుకోవడం కంటే 'గేమ్ ఛేంజర్' రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత చరణ్ సోలో హీరోగా యాక్ట్ చేసిన సినిమా థియేటర్లలోకి రాలేదు. అందుకని, ఈ మూవీపై ఎక్కువ క్రేజ్ ఉంది.


Also Read: పాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?