Mahesh Babu Ram Charan: మధ్యాహ్నం తర్వాత ఓటేసిన స్టార్ హీరోలు మహేష్, చరణ్ - ఎండను లెక్క చేయకుండా వచ్చిన తారలు

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సోమవారం ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి వసుంధరా దేవితో కలిసి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలో ఓటు వేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్యాహ్నం తర్వాత ఓటు వేశారు. శ్రీమతి నమ్రతతో కలిసి జూబ్లీ హిల్స్ లో పోలింగ్ బూత్ వద్దకు ఆయన విచ్చేశారు. ఓటు వేయడానికి ఇంకా సమయం ఉందని, మధ్యాహ్నం తర్వాత కూడా ప్రజలు ఇళ్ల నుంచి వచ్చి ఓటు వేయాలనే పరోక్ష సందేశాన్ని అందించారు.

చిరంజీవి, సురేఖ దంపతులు సోమవారం ఉదయం ఓటు వేయగా... ఆయన కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మధ్యాహ్నం ఓటు వేశారు. సతీమణి ఉపాసనతో కలిసి ఆయన పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు. తన వంతు బాధ్యత నిర్వర్తించి వెళ్లారు.
నటుడు మురళీ మోహన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు.
యాంగ్రీ స్టార్ రాజశేఖర్, ఆయన సతీమణి - దర్శక నిర్మాత - నటి జీవిత దంపతులు సైతం సోమవారం మధ్యాహ్నం తర్వాత ఓటు వేశారు.
ఓటు వేసిన 'బేబీ' నిర్మాత ఎస్.కె.ఎన్
హీరో సుధీర్ బాబు, ప్రియదర్శి దంపతులు సైతం సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నటుడు, దర్శకుడిగా 'బలగం' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న వేణు సైతం ఓటు వేశారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి
ఓటు వేసిన 'పలాస' సినిమా ఫేమ్, యువ హీరో రక్షిత్ అట్లూరి
ఓటు వేసిన హీరో సుహాస్