Rakhi Sawant Reacts Gun Shots Fired Outside Salman Khan House: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటన ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనానికి తెర లేపిందో తెలిసిందే. ఓ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి సల్మాన్ ఖాన్ ఇంటిపైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం గ్యాలక్సీ అపార్ట్మెంట్స్ ముందు ఈ కాల్పులు జరిపారు. మొదట మూడు రౌండ్ల బుల్లెట్లు ఆపై నాలుగు రౌండ్లు.. ఇలా రెండుసార్లు సల్మాన్ ఖాన్ ఇంటిముందు గాల్లో కాల్పులు జరపడంతో అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ ఇంటి ముందు భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు. కాగా ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అనుమోల్ బిష్ణోయ్ తన సోషల్ మీడియాలో 'ఇది ట్రైలర్' మాత్రమే అంటూ సల్మాన్ ఖాన్‌కు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తూ పోస్ట్ చేశాడు. కాగా దీనిపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ స్పందిస్తూ ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


సల్మాన్ భాయ్‌ను చంపొద్దు.. మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా..


గ్యాంగ్ స్టర్ అనుమోల్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై రాఖీ సావంత్ ఓ వీడియో షేర్ చేసింది. "ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అది సరికాదు. మీరు దీన్ని ట్రైలర్ అని పిలిచారు. కానీ అది మంచి పని కాదు. సల్మాన్ భాయ్ నా సోదరుడు. అతను బాలీవుడ్ లెజెండ్. ఇప్పటిదాకా జరిగిన ఇన్సిడెంట్ చూసి ప్రస్తుతం అందరూ భయపడుతున్నారు. కానీ నా వద్దకు ఎవరూ రారని నాకు తెలుసు. నేను దేవుడికి తప్ప మరెవరికి భయపడను. మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నా. సల్మాన్ భాయ్‌ను చంపొద్దు. అతను ఎంత మంచి మనిషో మీకు కూడా తెలుసు" అని వీడియోలో పేర్కొంది.


సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి మనకు ఎక్కడ దొరుకుతాడు?


ఇదే వీడియోలో తన తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్‌కు, ఆపరేషన్ కోసం సల్మాన్ ఖాన్ డబ్బులు ఇచ్చినట్లు వెల్లడించింది. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. "మా అమ్మ చావు బతుకుల్లో ఉంటే ఆమె క్యాన్సర్ ఆపరేషన్ కోసం సల్మాన్ భాయ్ చాలా డబ్బు ఖర్చు చేశాడు. కరోనా టైంలో నేను ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా సాయం చేశాడు. అలాంటి మంచి వ్యక్తి మనకి ఎక్కడ దొరుకుతాడు?" అని చెప్పింది.


సల్మాన్ ఖాన్ ని చంపి ఏం పొందుతారు?


పేదలకు సల్మాన్ ఖాన్ ఎంతలా సాయపడుతున్నాడో రాఖీ సావంత్ ఇదే వీడియోలో వివరించింది. "సల్మాన్ ఖాన్ ఒక లెజెండ్. ఎంతోమందిని కాపాడి వారికి జీవన ఉపాధిని కల్పించాడు. ఎంతోమంది పేదలకు సాయం చేశాడు. అలాంటి మంచి మనిషి ప్రాణం తీయడం ద్వారా మీరేం పొందుతారు? అతని ఎన్జీవోల వల్లనే చాలా గృహాలు నడుస్తున్నాయి. పేదలకు అవసరమైన డబ్బులు అందించేందుకే ఆయన సినిమాల్లో పనిచేస్తుంటాడు. నాలాంటి పేదల కోసం సల్మాన్ చాలా చేశాడు" అని సల్మాన్ గొప్పతనాన్ని వివరించింది.


Also Read : ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను