సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అభిమానులు 'జైలర్' విజయంతో హ్యాపీగా ఉన్నారు. ఆగస్టు 9న విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ బరిలో వసూళ్ల సునామీ సృష్టించింది. ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. వాళ్లకు ఓ గుడ్ న్యూస్! సంక్రాంతికి కూడా రజనీకాంత్ సినిమా థియేటర్లలోకి రానుంది.
కుమార్తె దర్శకత్వంలో రజనీ సినిమా
రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా 'లాల్ సలాం' (Lal Salaam Movie). ముంబైకి చెందిన మాఫియా డాన్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో ఆయన కనిపిస్తారు. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకురాలు. 'బాషా' నుంచి మొదలు పెడితే... ఆ మధ్య వచ్చిన 'కాలా', 'కబాలి' వరకు అనేక సినిమాల్లో రజనీకాంత్ డాన్ రోల్స్ చేశారు. మరి, ఆయనను అమ్మాయి ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి.
సంక్రాంతి బరిలో 'లాల్ సలాం'
'లాల్ సలాం' సినిమాలో విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ సంతోష్ (Vikranth Santhosh) హీరోలు. ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నారు. సభాస్కరన్ సమర్పణలో తమిళనాట అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేసింది. అయితే... విడుదల తేదీని ఇంకా వెల్లడించలేదు. త్వరలో అనౌన్స్ చేయవచ్చు.
Also Read : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?
క్రికెట్ నేపథ్యంలో 'లాల్ సలాం' రూపొందుతోందని సినిమా అనౌన్స్ చేసినప్పుడు వెల్లడించారు. అయితే... క్రికెట్ ఒక్కటే కాదని, ఈ సినిమాలో క్రికెట్ నేపథ్యంలో జరిగిన అల్లర్లు కూడా ఉంటాయని సమాచారం అందుతోంది. రజనీకాంత్ రాకతో సినిమా సైజ్ పెరిగింది. ప్రేక్షకుల్లో బజ్ ఏర్పడింది. ఇందులో రజనీ సోదరిగా జీవితా రాజశేఖర్ కనిపించనున్నారు.
Also Read : బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?
రజనీకాంత్ పాత్ర గురించి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రతినిథులు మాట్లాడుతూ ''లాల్ సలాం'లో ఓ శక్తివంతమైన పాత్ర ఉంది. దాన్ని మరోస్థాయికి తీసుకు వెళ్లే గొప్ప నటుడు కావాలని, సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని రిక్వెస్ట్ చేశాం. మాతో ఉన్న అనుబంధం కారణంగా ఆ పాత్రలో నటించడానికి ఆయన ఓకే చెప్పారు. ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 'లాల్ సలాం' డిఫరెంట్ మూవీ'' అని చెప్పారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial