ఇప్పటికే పలువురు ఇండియన్ బ్యూటీస్ హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె సహా మరికొంత మంది అంతర్జాతీయ చిత్రాల్లో సత్తా చాటుతున్నారు. ప్రియాంక పూర్తిగా హాలీవుడ్ చిత్రాలకే పరిమితం అయ్యింది. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సైతం ఓ హాలీవుడ్ మూవీ చేస్తోంది. ‘ది ఐ’ పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, మార్క్ రౌలీ జంటగా నటించిన ఈ సినిమా ఓ సైకలాజికల్ థ్రిల్లర్. 


గత ఏడాది ‘ది ఐ’ షూటింగ్ ప్రారంభం


డాఫ్నే ష్మోన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమిలీ కార్ల్టన్ స్క్రీన్ ప్లే రాశారు. 1980 నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రాన్ని డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా చిత్రీకరించారు. తన భర్త మరణించిన ద్వీపానికి, అతని చితాభస్మాన్ని తీసుకెళ్లే  ఒక యువ వితంతువుపై కథను ఈ చిత్రంలో చూపించారు. అన్నా సవ్వా (ది డ్యూరెల్స్), లిండా మార్లో (టింకర్ టైలర్ సోల్జర్ స్పై),  క్రిస్టోస్ స్టెర్గియోగ్లౌ (డాగ్‌టూత్) ఈ చిత్రంలో కీలక పాత్రలుపోషిస్తున్నారు. గ్రీక్ నిర్మాణ సంస్థ అర్గోనాట్స్ ప్రొడక్షన్స్, ఫింగర్‌ ప్రింట్‌ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మించింది. గత ఏడాది చివరల్లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. ఏథెన్స్, కార్ఫులో సినిమా షూటింగ్  కొనసాగింది.  


అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న ‘ది ఐ’


సినిమా ప్రారంభానికి ముందు శృతిహాసన్ అప్పట్లో సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. “చక్కటి టీమ్ తో కలిసి ‘ది ఐ’ సినిమాలో నటించండం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన కథ నేను ఇప్పుడే చెప్పలేను. ఈ చిత్రం బృందంలో భాగస్వామ్యం కావడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాను” అని శృతి హాసన్ తెలిపింది. తాజాగా ‘ది ఐ’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.  “కొన్నిసార్లు మాయాజాలం, భావోద్వేగం, నిజాయితీతో కూడిన ప్రాజెక్టులలో భాగం అవుతారు. అలాగే నాకు ‘ది ఐ‘ చిత్రం చాలా ప్రత్యేకమైనది. మీరందరూ దీనిని చూసేంత వరకు నేను వేచి ఉండలేను. గ్రీక్ అంతర్జాతీయ చలనచిత్ర ప్రదర్శనలలో రెండు కేటగిరీల్లో ‘ది ఐ’ నామినేట్ చేయబడింది. ఉత్తమ డైరెక్టర్ కేటగిరీలో డాఫ్నే ష్మోన్ పోటీ పడుతుండగా,  ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా జేమ్స్ చెగ్విన్ బరిలోకి దిగారు. లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ది ఐ’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది” అని వెల్లడించింది. అటు “ఈ సినిమా షూట్ పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. మొత్తం చిత్రబృందం గ్రీన్ షూట్స్ సస్టైనబిలిటీ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి పర్యావరణంపై కార్బన్ ప్రభావాన్ని తగ్గించే దిశగా పని చేశారు” అని వివరించింది.






శృతిహాసన్ ఇప్పటికే అమెరికన్ సిరీస్ ‘ట్రెడ్‌ స్టోన్’లో కనిపించింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సలార్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. భారీ మాస్ యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ‘సలార్’ సినిమా డిసెంబర్ 22న థియేటర్లోకి రాబోతోంది. ఇందులో శృతి 'ఆధ్య' అనే జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial