సెలబ్రిటీలు సాధారణంగా తమకు సంబంధించిన వస్తువులను అప్పుడప్పుడు అభిమానులకు ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తారు. తాజాగా ర్యాప్ సింగర్ బాద్ షా (Singer Badshah) కూడా తన 15 ఏండ్ల అభిమానికి మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. తాజాగా ఆయన యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ఓ 15 ఏండ్ల అభిమానికి తనకు ఎంతో ఇష్టమైన స్నీకర్లను గిఫ్ట్ గా ఇచ్చారు.
అభిమానికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ర్యాపర్ బాద్ షా
అభిమానులతో కలిసి యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ నిర్వహించిన బాద్ షా... ఈవెంట్ లో స్టేజి మీద అదిరిపోయే పాటలతో అభిమానులను అలరించారు. బాద్ షా ర్యాప్ సాంగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ప్రదర్శన అయిపోయాక తన ఇష్టమైన స్నీకర్లను ఓ అమ్మాయికి బహుమతిగా అందించారు. ముందు వరుసలో నిలబడిన మోనికా బొహ్రా అనే 15 ఏండ్ల యువతి వీటిని అందుకుంది. ముంబైకి చెందిన అమ్మాయికి అందించిన ఈ స్నీకర్ల విలువ సుమారు రూ. 1.50 లక్షలు ($1,660) ఉంటుందట. వీటిని వర్జిల్ అబ్లో రూపొందించారట. లూయిస్ విట్టన్ హై టాప్ స్నీకర్లను అందుకోవడం పట్ల అభిమాని సంతోషం వ్యక్తం చేసింది. తన పుట్టిన రోజునే బాద్ షా నుంచి అరుదైన బహుమతి లభించడం పట్ల ఆమె ఆనందంలో మునిగిపోయింది. సోషల్ మీడియా వేదికగా బాద్ షాకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ అమ్మాయికి నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు.
బాద్ షా ఏమన్నారంటే?
తన స్నీకర్లను బహుమతిగా ఇవ్వడంపై బాద్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నా అభిమానులకు నేను ఎప్పటికి కృతజ్ఞుడిగానే ఉంటాను. వారి ప్రోత్సాహంతోనే నేను మరింత మెరుగ్గా రాణిస్తున్నాను. వారి ప్రేమ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ ప్రేమ, అభిమానాలకు నేను వెలకట్టలేను. నన్ను ఎంతో ఇష్టపడే అభిమానికి నేను ఎంతో ఇష్టపడే స్నీకర్లను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉంది. అభిమానుల ప్రేమ ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.
బాద్ షా గిష్ట్ గా ఇచ్చిన స్నీకర్ల గురించి..
బాద్‌షా తన అభిమానికి బహుమతిగా ఇచ్చిన మోడల్‌ను ది LV ట్రైనర్ 2గా పిలుస్తారు. వీటిని దూడ చర్మంతో రూపొందించారు. క్లాసిక్ వైట్, బ్లాక్ రంగులను కలిగి ఉంది. ఇది 1990ల బాస్కెట్‌బాల్ స్టైలింగ్‌ను సమానంగా ఉంటుంది. అబ్లో ఆమోదించిన పాతకాలపు స్నీకర్ డిజైన్‌ను సూచిస్తుంది. దాని హీల్ హగ్గింగ్ హై-టాప్ కట్, ఇంకా పెద్ద టంగ్, అనలాగ్ హుక్ అండ్ లూప్ యాంకిల్ స్ట్రాప్, ప్యాడెడ్ నైలాన్, అల్ట్రా సప్లి నూబక్, అగ్రెసివ్ మిడ్‌సోల్‌తో ఉంటుంది. వీటి తయారీకి సుమారు 7 గంటల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బాద్ షా ఇండియాస్ గాట్ టాలెంట్ S10లో న్యాయనిర్ణేతగా కనిపిస్తున్నాడు. ఇక శిల్పా శెట్టి ‘సుఖీ’కి ఆయన సంగీతం అందించారు.
Read Also: దయచేసి ఇకనైనా మారండి- తెలుగు సినిమాపై విమర్శకులు చేసేవాళ్లకు 'హైపర్' ఆది పంచ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial