సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ సినిమా కోసం అత్యంత భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా అందుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ‘జైలర్’ను నిర్మించిన సన్ పిక్చర్స్ అధినేత.. రజినీకాంత్‌కు రెమ్యునరేషన్‌కు సంబంధించిన చెక్‌ను అందజేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కవర్లో రూ.100 కోట్ల చెక్‌ను ఉందంటూ వార్తలు వస్తున్నాయి.


రజినీకి స్పెషల్ చెక్..


సన్ పిక్చర్స్ అధినేత కళానిథి మారన్..రజినీకాంత్‌కు బీఎండబ్ల్యూ కారును కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఒక కవర్‌ను కూడా రజినీకాంత్‌కు అందజేశారు. నిర్మాతలు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘కళానిదథి మారన్, సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను కలిశారు. చెక్‌ను అందజేశారు. జైలర్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు’’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. అయితే ఇప్పటికే ‘జైలర్’ కోసం రజినీకాంత్‌కు అందాల్సిన రెమ్యునరేషన్ అందిందని, ఈ చెక్ ‘జైలర్’ లాభాల్లో నుంచి రజినీకి అందిన గిఫ్ట్ అని టాక్ వినిపిస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఇప్పటివరకు విడుదలైన చిత్రాల్లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో ముందుగా ‘కేజీఎఫ్ 2’, ‘బాహుబలి 2’ ఉండగా.. మూడో స్థానాన్ని ‘జైలర్’ సాధించింది. అయితే, ఆ కవర్లో రూ.100 కోట్ల చెక్ ఉందనే ప్రచారం నడుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.






ఏకంగా రూ.210 కోట్లు..


అసలైతే ‘జైలర్‌’లో నటించడం కోసం రజినీకాంత్ రూ.110 కోట్లను రెమ్యునరేషన్‌ అందుకున్నారట. అది కాకుండా ‘జైలర్’ లాభాల్లో నుంచి కళానిథి మారన్ మరో రూ.100 కోట్లను రజినీకు అందజేసినట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ‘జైలర్’ ద్వారా రజినీ రూ.210 కోట్లను సంపాదించినట్లే. ఇప్పటివరకు ఇండియాలో ఎవరికీ ఇంత భారీ స్థాయి రెమ్యునరేషన్ అందలేదని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల రెమ్యునరేషన్‌ను సాధించింది ‘జైలర్’. ఇక త్వరలోనే ఈ సినిమా సన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓటీటీ సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘జైలర్’ కోసం చాలాకాలం తర్వాత రజినీకాంత్, రమ్యకృష్ణ కలిసి నటించారు. ‘బీస్ట్’ లాంటి ఫ్లాప్ తర్వాత నెల్సన్ దిలీప్‌కుమార్ లాంటి దర్శకుడికి రజినీ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రేక్షకులు తనను విమర్శించారు. అయినా అవేవి పట్టించుకోకుండా రజినీ ముందడుగు వేసి హిట్ సాధించారు. ఇక ఈ మూవీకి అనిరుధ్ అందించిన సంగీతం.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.


ప్రపంచవ్యాప్తంగా అన్ని కోట్లు కలెక్ట్..


నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’.. రజినీకి చాలాకాలం తర్వాత సూపర్‌హిట్‌ను అందించింది. రజినీకాంత్ నటించిన ముందు సినిమాలు ప్రమోషన్స్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా ప్రేక్షకులను మెప్పించే విషయంలో వీక్‌గా మారిపోయాయి. కానీ ‘జైలర్‌’ మాత్రం వాటన్నింటిని మర్చిపోయేంత హిట్‌ను అందించింది. ఇప్పటికీ పలు థియేటర్లలో ఇంకా ‘జైలర్’ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.564.35 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ మూవీ సూపర్ సక్సెస్‌ఫుల్ అవ్వడంతో దీనిని నిర్మించిన సన్ పిక్చర్స్ అధినేత కళానిథి మారన్.. రజినీకాంత్‌ను నేరుగా కలిసి ఆయన రెమ్యునరేషన్‌ను అందజేశారు. దీన్ని బట్టి చూస్తే ఇన్నాళ్లలో ఇంత భారీ రెమ్యునరేషన్ అందుకున్న మొదటి హీరో రజినీకాంతే అని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.


Also Read: ‘జవాన్’ ట్రైలర్‌లో ఆలియా భట్ కావాలన్నా షారుఖ్ - ఇదిగో ఆమె ఇలా స్పందించింది!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial