భోజ్‌పురి సినిమా పరిశ్రమకు చెందిన ఓ నటి, తోటి నటుడిపై సంచలన ఆరోపణలు చేసింది. పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి, అఘాయిత్యానికి ఒడిగట్టాడని వెల్లడించింది.  పోలీసులను కలిసి ఆమె ఫిర్యాదు చేసింది. నటి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై ప్రత్యేక బృందంతో విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే సదరు నటుడు అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఆగష్టు 29న భోజ్‌పురి నటి పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది.  


సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుక సాయం చేశా


పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి, పలు సంచలన విషయాలను వెల్లడించింది. సదరు నటుడిని తానే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. ఇప్పుడు తన పట్లే దారుణంగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేసింది. "నేను ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్నప్పుడు, అతడు నాకు పరిచయం అయ్యడు. సోషల్ మీడియా ద్వారా అతడు కలిశాడు. ఇద్దరం మాట్లాడుకునే వాళ్లం. పరిచయం అయిన తొలి రోజుల్లో చాలా చక్కగా మాట్లాడేవాడు. చాలా మర్యాదగా వ్యవహరించేవాడు. అతడికి ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక ఉన్నట్లు చెప్పాడు. అతడు ఇండస్ట్రీలోకి వచ్చేలా నేను సాయం చేశాను. నా పరిచయాల ద్వారా అతడికి ఇండస్ట్రీలో పని కల్పించాను” అని వెల్లడించింది.


నమ్మించి అత్యాచారం చేశాడు!


తన సాయంతో ఇండస్ట్రీలోకి వచ్చిన తను, చాలా కాలం ఫ్రెండ్లీగా ఉన్నట్లు నటి చెప్పింది. అతడిని నేను పూర్తిగా నమ్మాను. నన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పేవాడు. కొంతకాలం తర్వాత అతడు మా ఇంటికి వచ్చాడు. అంతేకాదు, తను మా ఇంటి పరిసరాలకు మకాం మార్చాడు. ఒక రోజు నేను ఒంటరిగా ఉన్నప్పుడు,  అకస్మాత్తుగా తాగి మా ఇంటికి వచ్చాడు. నన్ను బలవంతం చేశాడు. ఆ తర్వాత అక్కడే పడుకుండిపోయాడు. మరుసటి రోజు ఉదయం, అతను స్పృహలోకి వచ్చినప్పుడు నేను ఏడుస్తూ రాత్రి జరిగిన విషయాన్ని చెప్పాను. పోలీస్ స్టేషన్ కి వెళతానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అతడు ఏడుస్తూ క్షమాపణలు చెప్పాడు. తన కుటుంబాన్ని ఒప్పిస్తే.. వెంటనే పెళ్లి చేసుకుంటానని ఓదార్చాడు. కానీ, మరోసారి అలాగే చేశాడు. మళ్ళీ నా మీద బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, నా మీద దాడి చేశాడు. జుట్టుపట్టుకుని కొట్టాడు. తీవ్రంగా గాయపరిచాడు” అని సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.   


ప్రస్తుతం ఈ కేసు భోజ్‌పురి సినిమా పరిశ్రమలో సంచలనం కలిగిస్తోంది. సినీ జనాలు నటికి మద్దతుగా నిలుస్తున్నారు. సదరు నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. మరోవైపు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.


Read Also: ‘డీజే’ మూవీలో బన్నీ నా పార్ట్ వదిలేసి మిగతా సినిమా తీయాలన్నారు, ఆ సినిమా చేయనన్నా: చంద్రమోహన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial