AP Power Cuts : ఏపీలో కరెంట్ కోతలతో ఉక్కపోత - ధర్నాలకు దిగుతున్న ప్రజలు !

ఏపీలో కరెంట్ కోతలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. పలు చోట్ల సబ్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తున్నారు.

Continues below advertisement

 

Continues below advertisement

AP Power Cuts :  తగినంతగా వర్షాలు పడకపోవడం.. పెద్ద ఎత్తున కరెంట్ కోతల్ని అమలు చేస్తూండటంతో..  ఏపీలో అప్రకటిత కరెంట్ కోతలు అమలవుతున్నాయి. లోడ్ రిలీఫ్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో  కరెంట్ కోతలు అమలు చేస్తూండటంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.  ఓ వైపు పెరిగిన ఉష్ణోగ్రతలు మరోవైపు కరెంట్ కోతలతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.   కొన్నిరోజులుగా వేళాపాళా లేకుండా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఇంట్లో ఉక్కపోత.. బయటకు వెళ్లాలంటే వడగాడ్పుల భయంతో ప్రజలు ఇబ్బంది పుడతున్నారు.                                        

ఇలాంటి పరిస్థితుల్లో  రాత్రి వేళల్లో కరెంటు పోవడంతో చిన్న పిల్లలు, వృద్ధులు నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారు. కోతలు అమలు చేస్తున్నట్లు డిస్కంలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయినా కోతలు సర్వసాధారణమయ్యాయి. దీనికి సాంకేతిక సమస్యలే అంటూ కారణాలు చెబుతున్నారు విద్యుత్ అధికారులు. డిమాండుకు అనుగుణంగా విద్యుత్‌ను సమకూర్చుకోవడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి అనధికారిక కోతలకు ‘సాంకేతిక సమస్య’ ముద్ర వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో పలు చోట్ల ప్రజలు ధర్నాలకు దిగుతున్నారు.                        

 

తెలుగుదేశం పార్టీ ప్రజల ఇబ్బందుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. 

 

 

వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ విపరీతంగా ఉంటుంది.  వర్షాకాలం వచ్చిన తర్వాత  డిమాండ్ తగ్గుతుంది. కానీ ఈ సారి  వర్షాకాలంలోనూ అదే ఎండాకాలంలాగే ఉండటంతో విద్యుత్ డిమాండ్  రికార్డు స్థాయికి చేరింది. జల విద్యుత్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. విద్యుత్ కొరత కారణంగా విద్యుత్‌ను సర్దుబాటు చేయడానికి గ్రామాల్లో ఎడాపెడా కోతలు విధించారు. కొన్ని పట్టణాల్లోనూ రెండు రోజులకోసారి కోతలు తప్పట్లేదు.  డిమాండ్ మేరకు  విద్యుత్‌ను సర్దుబాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది.    కరెంట్ కోతలతో ఏపీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.                

పట్టణాలు, మండల కేం ద్రాలు మినహాయించి మిగిలిన ప్రాంతా ల్లో రాత్రి 7గం టల నుంచి తెల్లవారుజాము వరకు దఫదఫాలుగా కోతలు విధిస్తున్నారు. ఫలితంగా జ నం అల్లాడిపోతున్నారు. ఒక పక్క విపరీతమైన ఉక్కబోత, మరోపక్క దోమల బెడదతో కంటి నిం డా నిద్రపోలేని పరిస్థితితో అసహనానికి గురవుతున్నారు. కొన్ని రోజులుగా ఎండ తీవ్రత దాదాపు 40 డిగ్రీల వరకు ఉంటోంది. దీంతో జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ సాధారణ రోజులకంటే పెరిగిపోయిందని అధికారులు చెప్తున్నారు. అనూహ్యంగా పెరిగిపోతున్న డిమాండ్‌ లోడ్‌ను తగ్గించడానికి కోతలు విధిస్తున్నట్లు చెబుతున్నారు.

Continues below advertisement