Apollo hospital health bulletin on Rajinikanth health: సూపర్ స్టార్ రజనీకాంత్ హెల్త్ బాలేదు. ఆయన చెన్నైలో సోమవారం రాత్రి ఆస్పత్రి పాలయ్యారు. ఆ సంగతి తెలిసి అభిమానులు ఆందోళన చెందారు. అయితే... వాళ్లకు ఆస్పత్రి వైద్యులు గుడ్ న్యూస్ చెప్పారు. అది ఏమిటంటే... 


రెండు రోజుల్లో ఇంటికి రజనీకాంత్!
రజనీకాంత్ హెల్త్ బులిటెన్ (Rajinikanth Health Bulletin)లో అభిమానులకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే... రెండు రోజుల్లో ఆయన ఇంటిలో ఉంటారని చెప్పడం! డిశ్ఛార్జి సంగతి సరే... అసలు ఆయన ఎందుకు ఆస్పత్రికి వెళ్లారు? అంటే... 


సోమవారం (సెప్టెంబర్ 30వ తేదీ) సాయంత్రం నలతగా ఉందని రజనీకాంత్ చెప్పడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. గుండె నుంచి రక్త ప్రసరణ అయ్యే నాళాల్లో వాపు గుర్తించిన డాక్టర్లు, వెంటనే వైద్యం అందించడం ప్రారంభించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్ ఆధ్వర్యంలో రజనీకాంత్ శస్త్ర చికిత్స జరిగింది. నాన్ సర్జికల్ పద్ధతుల ద్వారా ఆయనకు స్టెంట్ వేశారు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని, ప్రణాళిక ప్రకారం అనుకున్న విధంగా సర్జరీ జరిగిందని ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నాయి.


Also Read: దళపతి విజయ్ లాస్ట్ సినిమాలో విలన్‌గా 'యానిమల్' స్టార్ బాబీ డియోల్ - హీరోయిన్లుగా వాళ్లిద్దరూ?






అక్టోబర్ 10న 'వేట్టయాన్'... సెట్స్ మీద 'కూలీ'
ఇప్పుడు రజనీకాంత్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో 'జై భీమ్' ఫేమ్ టీఈ జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన 'వేట్టయాన్' ఒకటి. ఆ సినిమా అక్టోబర్ 10న విజయ దశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. అందులో రజనీ జంటగా మలయాళ భామ, సీనియర్ హీరోయిన్ మంజూ వారియర్ నటించారు. ఆల్రెడీ విడుదలైన పాటలో ఆవిడ వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. టాలీవుడ్ మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి విలన్ రోల్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ హీరో - 'పుష్ప' ఫేమ్ ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్ కీలక పాత్రలు చేశారు. 


Also Readపదికి పైగా సినిమాలు... వెబ్ సిరీస్‌లకు లెక్క లేదు - ఈ వారంలో ఏ ఓటీటీలో ఏవేవి స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?



'వేట్టయాన్' కాకుండా 'విక్రమ్', 'ఖైదీ', 'మాస్టర్', 'లియో' సినిమాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ మరో సినిమా 'కూలీ' చేస్తున్నారు. అందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ తరహా పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ మీద ఉంది. రజనీ కోలుకున్న తర్వాత మళ్లీ చిత్రీకరణ ప్రారంభిస్తారు. అప్పటి వరకూ హీరో అవసరం లేని సన్నివేశాలను షూట్ చేయడానికి లోకేష్ ప్లాన్ చేస్తున్నారట.