తమిళనాడులో అగ్ర కథానాయకుడు, ప్రజల్లో విపరీతమైన పాపులారిటీ కల ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay) రాజకీయాల్లో అడుగు పెట్టారు. రాబోయే ఎన్నికల్లో పోటీ  చేసేందుకు ఇప్పటి నుండి సన్నద్ధం అవుతున్నారు. అయితే... చివరగా ఓ సినిమా చేసేందుకు ఆయన పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. విజయ్ లాస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం కె.వి.ఎన్‌. ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఆ సినిమాలో హీరోయిన్, విలన్, ఇతర నటీనటుల వివరాలను ఇవాళ వెల్లడించారు. 


ప్రతినాయకుడిగా హిందీ స్టార్ బాబీ డియోల్...
కథానాయికగా బుట్ట బొమ్మ పూజ, మమిత!
విజయ్ కథానాయకుడిగా రూపొందుతున్న 69వ చిత్రమిది (Thalapathy 69 Movie). ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కె.వి.ఎన్‌. ప్రొడ‌క్ష‌న్స్ పతాకం మీద వెంకట్ కె నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. జగదీష్ పళనిస్వామి, లోహిత్ సహ నిర్మాతలు.


'దళపతి 69'లో ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించనున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు. తమిళ హీరోతో ఆయనకు రెండో చిత్రమిది. 'కంగువా'లో ఆయన నటించిన సంగతి తెలిసిందే. 'యానిమల్'తో ఆయనకు ఫేమ్ వచ్చిన తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకు బోలెడు ఆఫర్లు వెళ్లాయి. వాటిలో కొన్ని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. 






'దళపతి 69'లో బాబీ డియోల్ (Bobby Deol) విలన్ కాగా... విజయ్ జంటగా నటించే అవకాశం బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde)తో పాటు మలయాళ బ్యూటీ, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజుకు దక్కింది. ఇంకా ఈ సినిమాలో ప్రియమణి, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించనున్నారు.


Also Read: 'గోట్' ఓటీటీ రిలీజ్... ఈ వారమే నెట్‌ఫ్లిక్స్‌లో దళపతి విజయ్ సినిమా, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?



అక్టోబ‌ర్ 2025లో 'దళపతి 69' గ్రాండ్ రిలీజ్!
Thalapathy 69 Release: దళపతి 69 సినిమా అనౌన్స్ చేసిన రోజే విడుదల విషయం గురించి చిత్ర నిర్మాణ సంస్థ స్పష్టమైన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ అయ్యేలా తెరకెక్కించడానికి దర్శకుడు హెచ్ వినోద్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Readపదికి పైగా సినిమాలు... వెబ్ సిరీస్‌లకు లెక్క లేదు - ఈ వారంలో ఏ ఓటీటీలో ఏవేవి స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?