సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్, బాక్సాఫీసు దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రజినీతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా విజయానికి దోహద పడ్డారని చెప్పాలి. రాక్ స్టార్ కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ‘కావాలయ్యా’ పాట రిలీజ్ కు ముందే సినిమాకి కావాల్సినంత బజ్ తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ సాంగ్.. మరోసారి ట్రెండింగ్ గా మారింది. 


'జైలర్' సినిమా ఫైనల్ రన్ దాదాపు పూర్తయిన నేపధ్యంలో, లేటెస్ట్ గా 'నువ్వు కావాలయ్యా' ఫుల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన అందచందాలతో, ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టింది. ఆమె హావభావాలకు, హాట్ లుక్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. అలానే సునీల్ ఫన్నీ మూమెంట్స్, రజనీకాంత్ స్టయిల్ స్వాగ్ వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.


Also Read: ఈసారి వినాయకుడి పండక్కి డబ్బింగ్ సినిమాలే దిక్కు!


'కావాలయ్యా' సాంగ్ కు అనిరుధ్రవి చందర్ క్యాచీ ట్యూన్ ను కంపోజ్ చేశారు. గాయని సింధూజ శ్రీనివాసన్ తో కలిసి ఫుల్ ఎనర్జిటిక్‌గా పాడారు. 'వన్నెలే నీవయ్యా.. చూసుకో నచ్చాయా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి' అంటూ రొమాంటిక్ లిరిక్స్ రాశారు గీత రచయిత శ్రీ సాయి కిరణ్. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించగా, ఆర్ నిర్మల్ ఎడిటింగ్ వర్క్ చేసారు. డీఆర్కే కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.



ముందుగా 'జైలర్' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదల చేసిన 'కావాలయ్యా..’ లిరికల్ వీడియోకి అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలచింది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఈ సాంగ్ కు స్టెప్పులేస్తూ రీల్స్ చేసి ట్రెండ్ చేశారు. రెండు నెలల క్రితం వచ్చిన ఈ పాట తమిళ్ వర్సన్ యూట్యూబ్ లో 17 కోట్ల వ్యూస్ తో సంచలనం సృష్టించగా, తెలుగు 'కావాలి' పాట 22 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇప్పుడు రిలీజైన వీడియో సాంగ్ 12 గంటల్లోనే 3 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.


600 కోట్ల క్లబ్ లో జైలర్.. 


'జైలర్' చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రజినీకాంత్ తో పాటుగా రమ్యకృష్ణ, మోహన్‌ లాల్, శివ రాజ్‌ కుమార్, జాకీష్రాఫ్, తమన్నా, వసంత్ రవి, మిర్నా మీనన్, వినాయకన్, సునీల్‌, యోగిబాబు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 


Also Read: 'మామ మశ్చీంద్ర' రిలీజ్ డేట్ ఫిక్స్ - సూపర్ స్టార్ అల్లుడు ఈసారి సాలిడ్ హిట్ కొడతాడా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial