నట కిరీటి డా. రాజేంద్రప్రసాద్ తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో నటుడు అలీని ఆయన అరే అంటూ వేదిక మీదకు పిలిచారు. అక్కడితో ఆగలేదు. ఆ తరువాత ఒక బూతు పదాన్ని వాడారు. దీనికి ముందు 'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను 'దొంగ ముం... కొడకా' అంటూ కామెడీ చేయబోయారు. బ్యాక్ టు బ్యాక్ పబ్లిక్ స్టేజీల మీద ఆయన ఇటువంటి పదాలు వాడడంతో మీడియాతో పాటు సామాన్య ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి.
ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు జరిగిన మర్నాడు (జూన్ 2) రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన 'షష్టిపూర్తి' సక్సెస్ మీట్ జరిగింది. ఆ వేడుకలో అలీ మీద తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సారీ చెబుతారని అందరూ ఆశించారు. డేవిడ్ వార్నర్ మీద చేసిన కామెంట్స్ పట్ల అప్పట్లో సారీ చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం సారీ చెప్పలేదు. పైగా తనను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ క్లాస్ పీకారు.
తప్పుగా అర్థం చేసుకుంటున్నారు...అది మీ కర్మ... మీ సంస్కారం అనుకుంటా!'షష్టిపూర్తి' విడుదలకు ముందు చిత్ర బృందంతో కలిసి ఇసై జ్ఞాని ఇళయరాజా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో రాజేంద్ర ప్రసాద్‌ను వీడు అంటూ సంభోదించారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసిన రాజేంద్ర ప్రసాద్... ''ఇళయరాజా గారు 'లేడీస్ టైలర్' డబల్ పాజిటివ్ చూసి నన్ను ఫస్ట్ టైమ్ 'ఒరేయ్' అన్నారు. అది ఆయన చూపించే ప్రేమ. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లలో నేను ఏదైనా మాట్లాడుతుంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మీ కర్మ. మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేనేం చేయలేను. తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ సంస్కారం. నేను అయితే ఇలాగే ఉంటాను. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతుంటా'' అని చెప్పారు. తన మాటలను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అది సంగతి.
Also Read: మళ్ళీ నోరు జారిన నటకిరీటి... ఈసారి అలీని ఏకంగా బూతులతో... రాజేంద్ర ప్రసాద్ తాగి వచ్చారా?
రాజేంద్ర ప్రసాద్ స్పందించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. అలీని అందరి ముందు నట కిరీటి అలా అనకుండా ఉండాల్సిందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తన వ్యాఖ్యల పట్ల రాజేంద్రుడిలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు సో సారీ చెబుతారని ఆశించడం అత్యాశే. ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో రోజాను కథానాయికగా పరిచయం చేశానని చెప్పిన సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఉపయోగించిన భాష పట్ల అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఆయన వయసుకు ఆ విధంగా మాట్లాడటం సరికాదని సామాన్యులు సైతం అంటున్నారు.
Also Read: వదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ