ఎవరైనా సరే వయసు పెరిగే కొలదీ హుందాగా వ్యవహరించాలి. తమ కంటే చిన్న వాళ్ళకు నలుగురిలో ఎలా నడుచుకోవాలో సూచనలు ఇచ్చేలా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. సాధారణ ప్రజలు సైతం ప్రతిదీ నిశితంగా గమనించే ఈ రోజుల్లో సినీ సెలబ్రిటీలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ తన వయసు, స్థాయి మరచి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ స్టేజిల మీద ఆయన ప్రవర్తన, మాట్లాడుతున్న మాటలు విమర్శల పాలు అవుతున్నాయి. ఈసారి అలీ మీద రాజేంద్ర ప్రసాద్ నోరు జారారు. 

ఏరా ఆలీ... ఎక్కడ? ఇటు రా లం...!సీనియర్ దర్శకుడు, నటుడు ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) పుట్టిన రోజు జూన్ 1న. ఈ సందర్భంగా తనతో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ వేడుకకు రాజేంద్ర ప్రసాద్ అటెండ్ అయ్యారు. అలాగే అలీ కూడా! స్టేజి మీద మాట్లాడేటప్పుడు 'ఏరా అలీగా... ఎక్కడ? ఇటు రా లం...' అంటూ నోరు జారారు రాజేంద్ర ప్రసాద్.

అలీతో రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)కు చనువు ఉండొచ్చు. ఇద్దరి మధ్య స్నేహం ప్రేక్షకులకు తెలియదు కదా! ఇంత స్నేహం ఉంటే మాత్రం... 'లం' అని ఎలా తిడతారు? స్టేజి మీద హుందాగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? ఆ మాట వాడటం రాజేంద్ర ప్రసాద్ స్థాయికి సరైనదేనా? అసలే ప్రతి ప్రోగ్రాం యూట్యూబ్‌లో లైవ్ ఇస్తున్న రోజులు ఇవి. జాగ్రత్తగా ఉండాలి కదా! ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్ నోరు జారిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. జనాలు అందరూ ఆయన తీరును తప్పు బడుతున్నారు. తాగి వచ్చారా? అని ప్రశ్నలు వేస్తున్నారు. 

డేవిడ్ వార్నర్ ముందు కూడా ఇంతే!నితిన్ 'రాబిన్ హుడ్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక క్యారెక్టర్ చేశారు. ఆ మూవీలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటించిన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు కామెడీ చేయబోయి నలుగురి ముందు నవ్వుల పాలు అయ్యారు రాజేంద్ర ప్రసాద్. 'డేవిడ్ వార్నర్ దొంగ ముం... కొడుకు' అంటూ ఆయన అనడం జనాలకు నచ్చలేదు. ఆ పద్ధతి ఏంటి? అంటూ చీదరించుకున్నారు.

Also Read: 'దిల్' రాజు వైఫ్ తేజస్వినిలో సడన్ ఛేంజ్... ఉన్నట్టుండి ఎందుకిలా?

రీసెంట్ రిలీజ్ 'షష్టిపూర్తి'లో రాజేంద్ర ప్రసాద్ నటించారు. 'లేడీస్ టైలర్'లో తన జంటగా నటించిన అర్చన మరోసారి ఈ సినిమాలోనూ నటించారు. స్టేజి మీద ఆవిడను 'నల్ల పిల్ల' అన్నారు రాజేంద్ర ప్రసాద్. కలర్ షేమింగ్ ఏమిటని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. 'పుష్ప 2' సినిమాకు గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకుంటే... ఒక ఈవెంట్‌లో 'వాడెవడో దొంగ. స్మగ్లర్ క్యారెక్టర్‌కు అవార్డు ఇచ్చారు' అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తర్వాత బన్నీని అనలేదని కవరింగ్ చేశారు. ఒకప్పుడు కామెడీ సినిమాలు చేశారని ఇప్పుడు కూడా స్టేజి మీద కామెడీ చేయాల్సిన అవసరం లేదుగా. ఈ స్థాయికి వచ్చిన తర్వాత హుందాగా ప్రవర్తించకపోతే ఎలా? రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు గుర్తిస్తారో??

Also Readవదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ