దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) సినిమాలు బాగా తీస్తారు. తన హీరోల చేత స్టెప్పులు బాగా వేయిస్తారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్... 'నాటు నాటు' సాంగ్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేత 'త్రిబుల్ ఆర్' సినిమాలో ఆయన వేయించిన స్టెప్పులకు ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చింది. అటువంటి రాజమౌళి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? స్టేజ్ దద్దరిల్లిపోతుంది. ఆడిటోరియం అంతా ఈలలు, కేకలతో మార్మోగుతుంది. సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంది. కావాలంటే చూడండి. 


అన్న కొడుకు పెళ్లిలో రాజమౌళి డాన్స్!
ఆస్కార్ అవార్డ్ విన్నర్, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణికి ఎస్ఎస్ రాజమౌళి చిన్నాన్న కొడుకు. ఆ సంగతి అందరికీ తెలుసు. కీరవాణి రెండో కుమారుడు, యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి వివాహం తాజాగా జరిగింది. అన్న కొడుకు పెళ్లిలో రాజమౌళి డాన్స్ అదరగొట్టేశారు. 


రాజమౌళి సినిమాలో సూపర్ హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. ఎంఎం కీరవాణి వేరే దర్శకులతో పనిచేసిన సినిమాల్లోనూ సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. అయితే తన సినిమాలో పాటలకు గానీ, తన అన్న కంపోస్ట్ చేసిన పాటలకు గానీ రాజమౌళి డాన్స్ చేయలేదు.






మాస్ మహారాజా రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలో 'లంచ్ కొస్తావా మంచ్ కొస్తావా' పాటకు రాజమౌళి, రమా దంపతులు డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు తమ ఫేవరెట్ హీరోతో రాజమౌళి చేయబోయే సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటే ఆయనమో ఈ విధంగా డాన్స్ చేస్తున్నారని మీమ్స్ కూడా పడుతున్నాయి.


Also Read: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?






ఇంతకీ శ్రీ సింహ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా?
కీరవాణి ఇంటి కోడలు అయిన అమ్మాయి ఎవరో తెలుసా? శ్రీ సింహ కోడూరి ఎవరి మెడలో మూడు ముడులు వేశారో తెలుసా? సీనియర్ హీరో నటుడు మాగంటి మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో శ్రీ సింహ పెళ్లి జరిగింది. డిసెంబర్ 14, 2024న ఈ జంట ఒక్కటి అయ్యింది. పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల రాజమౌళి కీరవాణి కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ఇంటి దగ్గర కనిపించలేదు. డెస్టినేషన్ వెడ్డింగ్ అనమాట... దుబాయ్ లో పెళ్లి చేశారు. 'మత్తు వదలరా 2' సినిమాతో ఈ ఏడాది శ్రీ సింహ కోడూరి మంచి విజయం అందుకున్నారు. 


Also Read50 షోలు వేస్తే 5000 టికెట్లు కూడా తెగలేదు... సిద్ధూను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ అరెస్ట్