'Friend in need is a friend indeed' అంటుంటారు. అవసరమైన సమయంలో సాయం చేసేవాడు నిజమైన స్నేహితుడు అని! ఆపద లేదా కష్టకాలం వచ్చిన తరుణంలో అండగా నిలబడే వాడు నిజమైన స్నేహితుడు అని! ఏపీ ఎన్నికల్లో తెలుగు దేశం - జనసేన - భారతీయ జనతా పార్టీ కూటమికి ప్రజల్లో బలమైన మద్దతు ఉందని తెలిసి... తన మావయ్య తమ్ముడు పార్టీ ఉన్న కూటమిని కాదని మరీ శిల్పా రవి రెడ్డి (Shilpa Ravi Reddy)కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతుగా నిలబడ్డారు. మరి, ఇప్పుడు ఆ శిల్పా రవి రెడ్డి ఎక్కడ?


పుష్ప... వేర్ ఈజ్ నంద్యాల శిల్ప?
శిల్ప రవి రెడ్డి ఎక్కడ? నంద్యాల పెళ్లి మరి అల్లు అర్జున్ ప్రచారం చేసి, మద్దతు తెలిపిన వైసీపీ నేత శిల్ప ఎక్కడ? ఇప్పుడు ఈ డిస్కషన్ సినిమా రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రేక్షకులు ప్రజలలో కూడా ఉంది. ఎందుకంటే...


ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం, వైసిపి అభ్యర్థికి మద్దతు పలకడం పలు విమర్శలకు దారి తీసింది. జనసేనను కాదని అటు వైపు ఎలా వెళతారు? అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా నీడ నుంచి దూరంగా జరగడానికి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి అల్లు అర్జున్ కొన్ని రోజులగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని, నంద్యాల శిల్పా రవికి సపోర్ట్ ఇవ్వడం కూడా అదేనని కామెంట్ చేసిన జనాలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒకానొక సమయంలో గొప్పగా చెప్పిన అల్లు అర్జున్... ఇప్పుడు మాట వరసకైనా వాళ్ళ పేర్లు ఎత్తకుండా తన ఆర్మీ అని పేర్కొనడం కూడా మెగా అభిమానులలో ఆగ్రహానికి కారణమైంది.‌ 


నంద్యాల వెళ్లి వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ 'తగ్గేదే లే' అన్నట్టు వ్యవహరించారు. 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ''నాకు ఇష్టమైతే వస్తా. నా మనసుకు నచ్చితే వస్తా. ఫ్రెండ్ కోసం నిలబడతా. అది మీ అందరికీ తెలిసిందే'' అన్నారు. మాటల సైతం మెగా అభిమానుల్లో మంటకు కారణం అయ్యాయి. అప్పటి నుంచి అల్లు అర్జున్ మీద కొంత గుర్రగా ఉన్నారు. 


విమర్శలను తట్టుకుని నిలబడితే శిల్పా రవి రాడా?
విమర్శలను తట్టుకునే మరీ శిల్పా రవి రెడ్డికి అండగా అల్లు అర్జున్ నిలబడ్డారు. 'పుష్ప 2' విడుదల సమయంలో కూడా అతనిని తన వెంట తిప్పారు. శిల్పా రవి రెడ్డి సైతం 'పుష్ప 2' విడుదలకు ముందు తన ట్విట్టర్ అకౌంట్లో ఆ సినిమా గురించి పోస్టులు చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయితే కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు.‌


టాలీవుడ్ హీరోలు అందరూ అల్లు అర్జున్ ఇంటికి వెళుతుంటే... తన ఫ్రెండ్ అని అల్లు అర్జున్ పబ్లిక్ వేదికల మీద కూడా చెప్పినా శిల్పా రవి రెడ్డి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దాంతో ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? అని అందరిలో ఒక ఆసక్తి మొదలైంది.‌ తన అవసరం కోసం మాత్రమే బన్నీని నంద్యాల శిల్పా రవి వాడుకున్నారా? బన్నీ అరెస్టయి జైలుకు వెళితే కనీసం ‌పరామర్శించడానికి కూడా ఇంటికి రావడం లేదా? ఒక్కటంటే ఒక్కటి ట్వీట్ కూడా చేయలేడా? అని మెగా ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.


Also Read50 షోలు వేస్తే 5000 టికెట్లు కూడా తెగలేదు... సిద్ధూను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ అరెస్ట్


అల్లు అర్జున్ అరెస్టు వార్త తెలియగానే చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి ఇంటికి వెళ్లారు. ఒక దశలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు కూడా చిరు వెళ్లాలని ప్లాన్ చేశారని, కానీ అభిమానులు భారీగా గుమ్మి కూడే అవకాశం ఉండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని సమాచారం. నంద్యాల శిల్పా రవి రెడ్డి వస్తే ఆ స్థాయిలో జనాలు వచ్చే అవకాశం లేదు. మరి ఆయన ఎందుకు అల్లు అర్జున్ ఇంటికి రాలేదో? ఎందుకు అవాయిడ్ చేశారో? అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు బన్నీ అరెస్టును రాజకీయంగా వాడుకోవడానికి చూస్తున్నారు తప్ప అల్లు కుటుంబాన్ని ఓదార్చే లేదా పరామర్శించే ఉద్దేశం వారిలో కనబడటం లేదు. తనకు నిజమైన స్నేహితులు ఎవరో అల్లు అర్జున్ తెలుసుకునే సమయం ఇదని ఇండస్ట్రీలో కొంత మంది సైతం వ్యాఖ్యానిస్తున్నారు.


Also Read: అల్లు ఇంటిలో టాలీవుడ్... మరి మెగా ఫ్యామిలీ ఎక్కడ? ఇవాళ ఎవరూ రాలేదే?