రాఘవా లారెన్స్ (Raghava Lawrence) మల్టీ టాలెంటెడ్ ఫిల్మ్ పర్సనాలిటీ. ఆయన కొరియోగ్రాఫర్. అలాగే, హీరో అండ్ డైరెక్టర్ కూడా! తాను హీరోగా నటిస్తూ, డైరెక్షన్ చేయడమే కాదు... ఇతరుల దర్శకత్వంలోనూ హీరోగా నటిస్తుంటారు.
 
ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు లారెన్స్. దీనిని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'రుద్రుడు' టైటిల్ ఖరారు చేశారు. 'ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్' అనేది ఉపశీర్షిక. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు (Rudhrudu Release Date). 


''ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాఘవ లారెన్స్ పవర్ ఫుల్ గా కనిపించారని ఆడియన్స్ సోషల్ మీడియాలో చెబుతున్నారు. సినిమాలో కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇందులో యాక్షన్ హైలైట్ అవుతుంది.  90 శాతం చిత్రీకరణ పూర్తయింది'' అని 'రుద్రుడు' యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. బహుశా... విడుదల సమయానికి హిందీ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తారేమో!?


Also Read : 'కొండా' రివ్యూ: కొండా మురళి, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?


'రుద్రుడు' సినిమాలో రాఘవా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రల్లో  కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 


Also Read : అల్లు అర్జున్‌కు వీరాభిమాని అరుదైన కానుక - ఐకాన్ స్టార్ అభిమానులే ఖర్చులన్నీ భరించి