సీనియర్ నటి పవిత్ర లోకేష్ గురించి ఇటీవల పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవిత్రాను నటుడు వీకే నరేష్ నాలుగో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, వార్తల్లో నిజం లేదని, అది కేవలం పుకారు మాత్రమేనని నరేష్ వ్యక్తిగత సిబ్బంది ప్రకటించారు. దీనిపై పవిత్రా లోకేష్ మాత్రం స్పందించలేదు. నరేష్, పవిత్ర కొన్నేళ్లు సహజీవనం చేస్తున్నట్టు టాలీవుడ్ వదంతులు వచ్చాయి. వారిద్దరు ఒకే ఇంట్లో నివసిస్తున్నారని, నరేష్ కుటుంబంతో అనేక వేడుకల్లో పవిత్రా కనిపిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల నరేష్, పవిత్ర మహబలేశ్వరం వెళ్లారు. అక్కడ చాలా మంది వీరిద్దరినీ జంటగా చూశారు. పెళ్లికి ముందు ఆశీస్సులు తీసుకోవడానికే అక్కడికి వెళ్లారంటూ మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. అయితే, వారు ఆ ఆలయం చరిత్రపై సినిమా తీస్తున్నారని, అందుకే అక్కడికి వెళ్లారని సన్నిహితులు తెలిపారు. అయితే, ఐదేళ్ల కిందట పవిత్ర లోకేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త సుచేంద్ర ప్రసాద్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు, ఆమె మాటల్లోనే..  


ప్రేమ అలా పుట్టింది..: ‘‘మేమిద్దరం కలిసి ఒక సీరియల్‌లో నటించాం. అది స్నేహమో, ప్రేమో, గౌరవమో తెలీదు గానీ.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానంతో పెళ్లి చేసుకున్నాం. ఆయన(సుచేంద్ర ప్రసాద్) చాలా గొప్ప వ్యక్తి. నాతో కంపేర్ చేసుకుంటే ఆయన చాలా బెటర్ పర్శన్. అలాంటి వ్యక్తిని మరొకరిలో చూడలేం. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా కనిపెట్టలేం. ఆయన నాతో ఎంతో గౌరవంతో మెలుగుతారు’’ అని పవిత్ర తెలిపారు.


వంట కూడా ఆయనే చేసేస్తారు: ‘‘ఆయన రచయిత, దర్శకుడు, నటుడు కూడా. కానీ, నాకు ఆయన నటుడిగానే నచ్చుతారు. ఇద్దరు కలిసి జంటగా నటించే అవకాశం వచ్చింది. కానీ, ఇద్దరం ఒకేసారి షూటింగ్‌కు వెళ్తే పిల్లలను చూసుకోడానికి ఎవరూ ఉండరని.. ఆ అవకాశాలను వదులుకొనేవాళ్లం. అలాంటి భర్త దొరికినందుకు నేను చాలా లక్కీ. కొంచెం టైమ్ ఉన్నా సరే సుచేంద్ర నాకు వండి పెట్టేస్తారు. ఇంట్లో అన్ని పనులు ఆయన చేస్తారు’’ అని పేర్కొన్నారు. 


నా సినిమాలు చూడరు: ‘‘ఆయన నేను తనకే సొంతమని భావించేవారు. అందుకే, నా సినిమాలు కూడా చూసేవారు కాదు. నేను కూడా ఏ రోజు ఒత్తిడి చేయలేదు. నా సినిమాల్లో మీకు నచ్చిన చిత్రం ఏమిటని కూడా అడగలేదు. ఆయన కూడా తనకు ఏ సినిమా నచ్చిందనే విషయాన్ని చెప్పరు. ఇంట్లో ఉన్నప్పుడు మా సినిమాలు గురించి మేం మాట్లాడుకోం’’ అని పవిత్ర ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, పవిత్ర లోకేష్ ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నారా? కుటుంబంతో కలిసి ఉంటున్నారా అనేది తెలియదు. ప్రస్తుతం వస్తున్న పుకార్లపై పవిత్ర తాజాగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.  


Also Read: పవిత్ర లోకేష్, 16 ఏళ్ల వయస్సులోనే గుండె పగిలే విషాదం!


అంబారిష్ వల్లే సినిమాల్లోకి వచ్చా, కానీ..: ‘‘10వ తరగతి చదుతున్న సమయంలో నాన్న చనిపోయారు. అమ్మ టీచర్ కాబట్టి ఆ జీతంతో ఇల్లు గడిచేది. కానీ, నాకు పెద్ద చదువులు చదవాలని ఆశ. సివిల్స్ చేసి గవర్నమెంట్ జాబ్ చేయాలని అనుకున్నాను. నాన్న చనిపోయిన తర్వాత కేవలం అంబారిష్ మాత్రమే మా ఇంటికి వచ్చి ఎలా ఉన్నారని పలకరించారు. ఆ సమయంలో ఆయన సినిమాల్లోకి రావాలని కోరారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టా. అంత గొప్ప నటుడి కుమార్తెను కాబట్టి ఇండస్ట్రీ గొప్పగా ఆహ్వానిస్తుందని భావించాను. కానీ, అక్కడ అలాంటి పరిస్థితి లేదు. మైసూర్ షూటింగ్ సమయంలో మా ఇంటికి వచ్చిన సెలబ్రిటీలు కనీస సాయం చేయలేదు. ఇండస్ట్రీలో వారి ప్రవర్తన భిన్నంగా ఉంది. సినిమాల్లో వచ్చే డబ్బుతో చదువుకొన్నాను. సివిల్స్‌లో విఫలమైన తర్వాత ఎంబీఏ చేద్దామని అనుకున్నా. డబ్బులు సరిపోవనే కారణంతో ఒక సంస్థలో హెచ్.ఆర్ టీమ్‌లో జాయిన్ అయ్యా. కానీ, ఆ రొటీన్ లైఫ్ బోరు కొట్టి మళ్లీ సినిమాలో నటించా. ఓ చిత్రం అనూహ్యంగా హిట్ కొట్టడంతో ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి’’ అని పవిత్ర వెల్లడించారు. 


Also Read: పవిత్ర లోకేష్‌తో నరేష్ నాలుగో పెళ్లి? అసలు నిజం ఇది