ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉత్తరాదిలో, హిందీ ప్రేక్షకుల్లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. గత ఏడాది ఆఖరున, డిసెంబర్ 17న 'పుష్ప: ది రైజ్' విడుదల అయ్యింది. ఆ సినిమాలో బన్నీ నటన, స్టైల్ బాలీవుడ్ ప్రేక్షకులకూ విపరీతంగా నచ్చింది. ఎంత ఎలా అంటే... ఔరంగాబాద్‌కు చెందిన సోహన్ కుమార్ అనే అభిమాని 'పుష్ప'లో అల్లు అర్జున్ విగ్రహం చేసేంతలా!


ఫోటోలో 'పుష్ప' ఐడల్ చూశారు కదా! ఫిబ్రవరిలో సోహాన్ కుమార్ దానిని తయారు చేశారు. అప్పటి నుంచి అల్లు అర్జున్‌ను కలవాలని ప్రయత్నిస్తున్నారు. ABP Live ద్వారా విషయం తెలుసుకున్న అల్లు అర్జున్, ఇటీవల సోహాన్ కుమార్‌ను కలిశారు. 


అల్లు అర్జున్‌ను కలిసిన తర్వాత 'ABP దేశం'తో సోహాన్ కుమార్ మాట్లాడుతూ ''ఈ నెల 18న కలవమని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి నుంచి నాకు పిలుపు వచ్చింది. ఫ్యాన్ క్లబ్‌కు చెందిన సభ్యులు జర్నీకి సంబంధించిన విషయాలు అన్నీ చూసుకుంటారని చెప్పారు. అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి, ఫ్యాన్ క్లబ్‌ ప్రెసిడెంట్ రవి గడ్డం ఫోన్ చేశారు. నేను 18వ తేదీ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాను. అల్లు అర్జున్ ఇంటికి తీసుకు వెళ్లారు. కాఫీ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. ఆల్రెడీ నేను తయారు చేసిన ఐడల్ ('పుష్ప'లో అల్లు అర్జున్ విగ్రహం) వీడియో చూశానని చెప్పారు. ఆయనకు వచ్చిన అవార్డులన్నీ పెట్టిన చోట ఈ విగ్రహానికి చోటు కల్పించారు. మ‌రాఠ్‌వాడాలో అల్లు అర్జున్ ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ చేస్తామని చెప్పారు. నాకు అవకాశం కల్పించారు. అక్కడ అభిమానుల వ్యవహారాలు అన్నీ చూడమని అన్నారు. సపోర్ట్ చేస్తానని చెప్పారు. నాకు ఇది పెద్ద అఛీవ్‌మెంట్‌. అల్లు అర్జున్ గారిని కలవడం అనేది నా కల. ఇవాళ అది నెరవేరింది. దీనికి సహకరించిన చంద్రశేఖర్ రెడ్డి, రవి గడ్డం... ఇద్దరికీ థాంక్స్. నాతో రూపాయి ఖర్చు పెట్టనివ్వలేదు. నా ఖర్చులన్నీ వారే భరించారు'' అని చెప్పారు. 


Also Read : టాలెంటెడ్ డాన్సర్స్ కోసం 'ఆహా' డాన్స్ ఐకాన్ - ఓంకార్ హోస్ట్ గా కొత్త షో!


'పుష్ప'కు సీక్వెల్‌గా 'పుష్ప: ది రూల్' చేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆల్రెడీ సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.


Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు