Pushpa The Rule Release Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా 'పుష్ప 2' రిలీజ్ ఎప్పుడు? అంటే... డిసెంబర్ మొదటి వారంలో! ఏ తేదీకి విడుదల అవుతుంది? అంటే... డిసెంబర్ 5న! డిసెంబర్ 6న రిలీజ్ అని అనౌన్స్ చేసినా... లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం విడుదల తేదీని ఒక్క రోజు ముందుకు తీసుకు వచ్చారట. మరో అప్డేట్ ఏమిటంటే... దాని కంటే ముందు ప్రీమియర్ షోలు వేసే ఆలోచనలో ఉన్నారట.


డిసెంబర్ 4 సాయంత్రం ముంబైలో ప్రీమియర్!
ఇండియాలో సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి అమెరికాలో ప్రీమియర్ షోస్ పడటం కామన్. కానీ, ఈ మధ్య సేమ్ టైంలో ఇండియాలోనూ బెనిఫిట్ షోలు వేస్తూ ఆడియన్స్ అందరినీ అట్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే, స్టార్ హీరో - బిగ్ బడ్జెట్ సినిమాల విషయంలో ఆలోచిస్తున్నారు. కానీ, అల్లు అర్జున్ అండ్ 'పుష్ప 2' టీమ్ మాత్రం మూవీ రిజల్ట్ మీద కాన్ఫిడెన్స్ చూపిస్తోంది.


ఓవర్సీస్ మార్కెట్స్, ఏరియాల్లో 'పుష్ప 2' ప్రీమియర్లు డిసెంబర్ 4న పడతాయి. ఆ సమయానికి కొంచెం అటు ఇటుగా ఇండియాలోనూ షోస్ వేసే ప్లాన్ చేశారు. హిందీ క్రిటిక్స్, సెలబ్రిటీస్ కోసం ముంబైలో డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం తొమ్మిది గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో వేసే ప్లాన్ ఉందట. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 5న తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్ షోలు వేస్తారని తెలుస్తోంది.


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ హిట్స్ 'సలార్', 'కల్కి 2898 ఏడీ'లకు తెలుగు రాష్ట్రాల్లో ఒంటి గంటకు షోలు వేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర'కూ అంతే! సేమ్ ట్రెండ్ 'పుష్ప 2' టీం కూడా ఫాలో అవుతోంది. అదీ సంగతి!


Also Readఓటీటీలోకి వచ్చిన 'లెవల్ క్రాస్'... అమలా పాల్ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?



అంచనాలు పెంచుతున్న 'పుష్ప' టీమ్ మెంబర్స్!
రీసెంట్ ప్రెస్ మీట్స్ ఫాలో అయితే... 'పుష్ప 2' టీమ్ మెంబర్స్ అందరూ సినిమా గురించి చెప్పే మాటలు అంచనాలు పెడుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తన కాన్సర్ట్ కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో 'పుష్ప 2' టాపిక్ వచ్చింది. అప్పుడు ఆయన ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ చూశానని, మైండ్ బ్లోయింగ్ స్టఫ్ అని చెప్పారు. అంతకు ముందు మరొక సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత ఎస్.కె.ఎన్ కూడా సినిమా గురించి గొప్పగా చెప్పారు.


'పుష్ప 2'లో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్న మరోసారి సందడి చేయనున్నారు. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, దాక్షాయణిగా అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి 'పుష్ప 2' సినిమాను నిర్మిస్తున్నారు.


Also Readమర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఖాన్ ఎందుకు వెళ్లారు? ఆస్పత్రికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు? ఎవరీ బాబా సిద్ధిఖీ??