SKN Gift to Baby Director : టీనేజ్ రొమాంటిక్ డ్రామా 'బేబీ' నిర్మాత ఎస్‌కెఎన్, ఆ మూవీ దర్శకుడు సాయి రాజేష్‌ పనితనం బాగా నచ్చినట్లుంది. కొన్ని నెలల క్రితం, బేబీ మొదటి సింగిల్ 'ఓ రెండు ప్రేమ మేఘలీలా' భారీ విజయాన్ని అందుకోవడంతో ఎస్‌కేఎన్ సాయి రాజేష్‌కి కొత్త SUVని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. తాజాగా 'బేబీ' మొదటి కాపీని చూసిన, ఎస్‌కేఎన్ మరోసారి డైరెక్టర్ సాయి రాజేష్‌ను ఆశ్చర్యపర్చాలని నిర్ణయించుకున్నాడు. అతను నిర్మిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’లో పవన్ కళ్యాణ్ ధరించిన షూలను సాయి రాజేష్‌కి బహుమతిగా ఇచ్చాడు. ఈ షూస్ ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బాల్మెయిన్ కు చెందినట్టు తెలుస్తోంది.


ఇటీవల యువతరం నటీనటులు ధరించే దుస్తులు, షూలతో పాటు వారు వాడే బ్రాండ్లపై కూడా చాలా శ్రద్ధ చూపుతున్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ చిత్రం 'బ్రో' కోసం మొదటి పోస్టర్ విడుదలైన సమయంలో.. ఫ్యాషన్-అభిమానుల్ని పవన్ కళ్యాణ్ ధరించిన బూట్లు ఎంతో ఆకట్టుకున్నాయి. బాల్మెయిన్ అనే బూట్ల బ్రాండ్ లకు చెందిన ఈ షూల ధర లక్ష రూపాయలకు పైగానే ఉంటుంది. ఈ పోస్ట్ సోషల్ మీడియా వైరల్ కావడంతో బేబీ చిత్రనిర్మాతకు, దర్శకుడు సాయి రాజేష్ తనకు అలాంటి షూస్ కావాలన్నాడట. అతను కోరినట్టుగా 'బేబీ' నిర్మాత SKN .. సాయి రాజేష్ కి అదే బ్రాండ్ బూట్లు బహుమతిగా ఇచ్చాడు 'బేబీ' మొదటి కట్‌ని చూసి, దర్శకుడి పనితనానికి ఎంతగానో ముగ్ధుడై, వెంటనే బాల్‌మైన్ షూస్‌ని ఆర్డర్ చేసి రాజేష్‌కి ఇచ్చారు.






SKN అభిమానానికి, ఔదార్యానికి పొంగిపోయిన సాయి రాజేష్.. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తాను SKN నుండి (షూస్) బహుమతిని అందుకుంటున్న చిత్రాన్ని ట్వీట్ చేశారు.  దీంతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’కు సంబంధించిన పోస్టర్ పాత ట్వీట్ వైరల్ అవుతోంది. తమకు కూడా ‘బ్రో’ షూస్ గిఫ్ట్‌గా ఇచ్చి సంతోష పెట్టవచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు. అయితే వారు ప్రత్యేకంగా కొనాలని కోరడం లేదు. పవన్ ధరించిన అవే షూస్ తమకు ఇవ్వాలని అంటున్నారు. 


విజయ్ దేవరకొండ తమ్ముడు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘బేబీ’ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్.. ఇటీవల హైదరాబాద్‍లోని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద గురువారం (జూన్ 29) నిర్వహించిన ఈవెంట్‍లో ప్రకటించింది. ఈ సినిమాను జూలై 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, లిరికల్ పాటలలు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.


Read Also : Salar Release Date: 'సలార్' మూవీ బిగ్ అప్డేట్ - టీజర్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial