హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ ఉన్నారు కదా! 'టాక్సీవాలా', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం', 'తిమ్మరుసు' సినిమాల్లో నటించారు. ఆమె ఇటీవల ఒక ఫోటో షూట్ చేశారు. కొన్ని ఫోటోల్లో ఆమెతో పాటు ఒక అబ్బాయి ఉన్నారు. అయితే, ఫోటోలను అతడి వెనుక నుంచి తీయడం వల్ల అతడి ముఖం కనిపించలేదు కానీ... అబ్బాయి అనేది తెలిసింది. దాంతో చాలా మంది నెటిజన్ల మదిలో 'అతడు ఎవరు?' అనే ప్రశ్న మొదలైంది. 


కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో ప్రియాంకా జవాల్కర్ ఫోటో షూట్ అంటూ నెట్టింట ప్రచారం జరిగింది. క్రికెటర్ వెంకటేష్ అయ్యర్, ప్రియాంక ప్రేమలో ఉన్నారని కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే... 'క్రికెట్ సిరీస్ కోసం వెంకటేష్ అయ్యర్ ఐర్లాండ్ వెళ్ళాడు కదా! మరి, ఈ అబ్బాయి ఎవరు?' అంటూ కొందరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ నోట ఈ నోట ఈ మేటర్ ప్రియాంకా జవాల్కర్ తల్లికి చేరింది. అమ్మాయిని అడిగారు. తల్లి అడగటంతో ప్రియాంకా జవాల్కర్ అసలు విషయం చెప్పేశారు. 


Also Read : హనీమూన్ నుంచి తిరిగొచ్చిన నయన్ - ఇప్పుడు ముంబైలో...


''ఈ ఫోటోలో నా ఎదురుగా కూర్చున్న అబ్బాయి ఆ రోజు ఫోటో షూట్ పనుల్లో సహాయం చేయడానికి వచ్చాడు. ఇక దీని గురించి మాట్లాడటం ఆపేస్తే చాలా బావుంటుంది. మధ్యలో (బాయ్ ఫ్రెండ్ అంటూ వచ్చిన) ఆర్టికల్స్ గురించి అమ్మ అడుగుతోంది'' అని ప్రియాంకా జవాల్కర్ చెప్పారు. అదీ సంగతి!


Also Read : హైదరాబాద్ కూల్ వెదర్ ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్